DCIL: డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, విశాఖపట్నంలో ఉద్యోగాలు- ఈ అర్హతలుండాలి

DCIL Vacancies: విశాఖపట్నం డీసీఐఎల్ పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్య్వూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.

Continues below advertisement

DCIL Recruitment: విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులను పోస్టుని అనుసరించి పాట్నా/కోల్‌కతా/గువహటీ, వెస్ట్ బెంగాల్/ అస్సాం, హెడ్ ఆఫీస్, విశాఖపట్నం, హెడ్ ఆఫీస్/రీజినల్ ఆఫీస్/ ప్రాజెక్ట్ ఆఫీస్, రిజిస్టర్డ్ ఆఫీస్, న్యూఢిల్లీ లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా నియమిస్తారు. అయితే, కంపెనీ అవసరాలకు అనుగుణంగా వారిని ఏ ప్రదేశానికైనా బదిలీ చేయవచ్చు.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 22

⏩ కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్: 04
అర్హత: సీవోసీ మాస్టర్ (FG) / ఎంఏటీఈ / డ్రెడ్జ్ మాస్టర్ (గ్రేడ్ I & II) / ఎంఈవో సీఐ-I & II / డ్రెడ్జ్ ఇంజినీర్ GR- I & II / మాస్టర్ NCV / డిగ్రీలో
సివిల్/మెకానికల్/ మెరైన్/డ్రెడ్జింగ్ మరియు హార్బర్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 40 - 65 సంవత్సరాల మధ్య ఉండాలి. 
జీతం: నెలకు రూ.1,50,000 - రూ.2,00,000.
పోస్టింగ్ వ్యవధి: 3 సంవత్సరాలు.
పోస్టింగ్ స్థలం: పాట్నా/కోల్‌కతా/గువహటీ.

⏩ ప్రాజెక్టు మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్ వర్స్క్‌: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్, సర్వే ఇంజినీరింగ్) / తత్సమాన అర్హత లేదా బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి:  01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000-రూ.65,000. 
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: వెస్ట్ బెంగాల్/ అస్సాం.

⏩ హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 12
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్, సర్వే ఇంజినీరింగ్) / బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్ /తత్సమాన అర్హత)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి:  01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.25,000-రూ.40,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: ఎంపికైన ఎనిమిది(8) మంది అభ్యర్థులను వెస్ట్ బెంగాల్/అస్సాంలో నియమిస్తారు. మిగిలిన పన్నెండు (12) మంది అభ్యర్థులను HO, వివిధ ప్రాజెక్ట్ కార్యాలయాలు మరియు కంపెనీ ప్రాంతీయ కార్యాలయాలలో నియమిస్తారు.

⏩ ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఓ/పీ): 02
అర్హత: మాస్టర్ (FG) సీవోసీ లేదా డ్రెడ్జ్ మాస్టర్ Gr.I సీవోసీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 50 సంవత్సరాల వరకు ఉండాలి.
జీతం: నెలకు రూ.1,00,000 - రూ.1,25,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: ఎంపికైన అభ్యర్థులకు కార్పొరేషన్ అవసరాలకు అనుగుణంగా హెడ్ ఆఫీస్/రీజినల్ ఆఫీస్/ ప్రాజెక్ట్ ఆఫీస్ లేదా మరే ఇతర ప్రదేశంలోనైనా పోస్టింగ్ ఇస్తారు.

⏩ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కన్సల్టెంట్: 01
అర్హత: ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ లేదా ఎంసీఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.1,00,000 - రూ.1,25,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: హెడ్ ఆఫీస్, విశాఖపట్నం.

⏩ లీగల్‌ కన్సల్టెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ లేదా సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి:  01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000- రూ.70,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: హెడ్ ఆఫీస్, విశాఖపట్నం.

⏩ రెసిడెంట్ మేనేజర్‌: 01
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఫస్ట్ క్లాస్‌లో ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమతి: 01.02.2025 నాటికి 45 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000-రూ.65,000.
పోస్టింగ్ వ్యవధి: 1 సంవత్సరం.
పోస్టింగ్ స్థలం: రిజిస్టర్డ్ ఆఫీస్, న్యూఢిల్లీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్య్వూ, మెడికల్ టెస్ట్ , తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.02.2025.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25.02.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola