DRDO RAC Recruitment 2022: సైంటిస్ట్ పోస్టుల కోసం డీఆర్‌డీవో నోటిఫికేషన్ ఇచ్చింది. 58 ఖాళీలను లక్నోలోని రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) ద్వారా భర్తీ చేయనుంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా DRDOలో సైంటిస్ట్ D, సైంటిస్ట్ C, సైంటిస్ట్ F, సైంటిస్ట్ E పోస్టులకు అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. DRDO సైంటిస్ట్ జాబ్స్ 2022 కోసం rac.gov.inలో ఆన్‌లైన్ అప్లికేషన్‌ను జూన్ 28, 2022 వరకు తీసుకోనుంది.
డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇందులో ఆయా కేటగిరిలను బట్టి వయోపరిమితి సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఇచ్చారు. సైంటిస్ట్ ఎఫ్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్లు 50 ఏళ్లకు మించి ఉండకూడదు. సైంటిస్ట్ డీ, ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్ల వయసు 45 ఏళ్లకు మించరాదు. సైంటిస్ట్ సీ పోస్టుకు 35 ఏళ్లకు మించి ఉండకూడదు. అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు వంద రూపాయల ఫీజు చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్లు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం విద్యార్హతలు
బీఈ, బీటెక్, ఇంజినీరింగ్‌లో డిప్లమో చేసిన వాళ్లతోపాటు మాస్టర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం అప్లై చేసుకోవచ్చు.
డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం వేతనం
ప్రిలిమినరీ, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ, నేరుగా వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ రెడీ చేస్తారు. నోటిఫికేషన్‌లో చెప్పినట్టుగానే వేతనాన్ని ఇస్తారు.
సైంటిస్ట్ ఎఫ్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి బేసిక్ పే రూ. 1,31,100 ఇస్తారు.
సైంటిస్ట్ ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 1,23,100 వేతంగా ఇస్తారు.
సైంటిస్ట్ డీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 78,800 ఇస్తారు.
సైంటిస్ట్ సీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి 67,700 చెల్లిస్తారు.
సైంటిస్ట్ సీ పోస్టుకు ఎంపికైన అభ్యర్థికి
డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగం కోసం ఎలా అప్లై చేసుకోవాలంటే...
డీఆర్‌డీవో ఆర్‌ఏసీ వెబ్‌సైట్ https://rac.gov.in ద్వారా జూన్ 28 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
డీఆర్‌డీవో సైంటిస్టు ఉద్యోగ ఖాళీల విభాగాల వారీగా వివరాలు
సైంటిస్ట్ ఎఫ్- ౦3
సైంటిస్ట్ ఈ-06
సైంటిస్ట్ డీ- 15ట
సైంటిస్ట్ సీ- 34
వెయిటేజ్
ఉన్నత విద్య చదివిన అభ్యర్థులకు వెయిటేజ్ ఉంటుంది. ఇంజినీరంగ్‌లో పీజీ చేసిన వాళ్లకు 2 ఏళ్లు వెయిటేజ్ ఇస్తారు. ఇంజినీరింగ్‌లో డాక్టరేట్ చేసిన వాళ్లకు నాలుగేళ్లు వెయిటేజ్ ఇస్తారు.