DRDL Recruitment: హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో- డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్) 1 సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ కొరకు నోటిపికేషన్ విడుదల చేసింది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తులు సంబంధిత చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమర్పించాలి. షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
* ఐటీఐ అప్రెంటిస్ పోస్టులు
ట్రేడులు..
⏩ ఫిట్టర్
⏩ టర్నర్
⏩ మెషినిస్ట్
⏩ మెషినిస్ట్ (గ్రైండర్)
⏩ కార్పెంటర్
⏩ వెల్డర్
⏩ ఎలక్ట్రీషియన్
⏩ డీజిల్ మెకానిక్
⏩ ఎలక్ట్రానిక్స్ మెకానిక్
⏩ అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్
⏩ పెయింటర్
⏩ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
⏩ ఫౌండ్రీమ్యాన్
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: నిబంధనల మేరకు.
కాల వ్యవధి: ఒక సంవత్సరం.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Director,DRDL, Kanchanbagh, Hyderabad-500058 and Attn: Chairman Selection & ScreeningCommittee, ITI Apprenticeship Training.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులు తీసుకురావాల్సిన సర్టిఫికేట్‌లు..
➥ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్,
➥ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్,
➥ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, కాస్ట్, దివ్యాంగ & ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ పాస్ బుక్ కాపీలు మరియు రెండు రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు.
➥షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వెరిఫికేషన్/ఇంటర్వ్యూ సమయంలో అన్ని ఒరిజినల్ సంబంధిత సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకురావాలి.
స్టైపెండ్: నిబంధనల ప్రకారం.
దరఖాస్తుకు చివరితేదీ: 29.01.2024.
ALSO READ:
డా.వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులువిజయవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులకు రూ.750. ఇతరులకు రూ.1500 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 31 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించి, ఫిభ్రవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
శ్రీకాకుళం జీజీహెచ్‌లో 40 పారామెడికల్ పోస్టులు, ఈ అర్హతలుండాలిGGH Srikakulam Recruitment 2024: శ్రీకాకుళం జిలాల్లోని వైద్య సంస్థల్లో కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పారామెడికల్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యావిద్యా విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 2 కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాగా.. 38 పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 20లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. జిల్లా పరిధిలోకి చెందినవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..