ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) పరీక్షకు సంబంధించిన మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాక్ టెస్టులకు హాజరుకావచ్చు. మాక్ టెస్టులకు సంబంధించిన లింక్‌లను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. మాక్ టెస్టులకు హాజరయ్యే అభ్యర్థులు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వివరాలు సమర్పించి మాక్ టెస్టులు రాయవచ్చు.


ఇప్పటి వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోని అభ్యర్థులు వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవడం ఉత్తమం. చివరి క్షణంలో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు ఎదురైతే అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వెంటనే హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి. అభ్యర్థులు తమ ఏపీ టెట్ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 


Download AP TET Hall Tickets


Click Here for Examination Schedule

ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల కోసం టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్ష(డీఎస్సీ)లో 20% వెయిటేజీ కూడా ఉంది. అభ్యర్థులు 1-5 తరగతుల బోధనకు పేపర్-1(ఎ, బి); 6-8 తరగతుల బోధనకు పేపర్-2 (ఎ, బి)లో అర్హత సాధించాల్సి ఉంటుంది.


Read Also: దేశ రాజధానిలో 547 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను జూన్ 10 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో AP TET 2022 పరీక్షకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్ 16 నుంచి జులై 16 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించింది.  టెట్ దరఖాస్తు ఫీజుగా ఒక్కో పేపర్‌కు రూ.500 వసూలు చేశారు. 


ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్‌ కీ విడుదల చేసి, సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేయనున్నారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు. 


పాఠశాల విద్యాశాఖ నిర్వహించే APTET-August, 2022 పరీక్షను అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. TET లక్ష్యం జాతీయ ప్రమాణాలు పాటించడం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు (National Council for Teacher Education - NCTE) అనుగుణంగా నియామక ప్రక్రియలో ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


Also Read:  6432 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తివివరాలు ఇలా!  

40 శాతానికి సడలింపు 
రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు డిగ్రీలో 40 శాతం మార్కులు ఉంటే బీఈడీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అర్హత కల్పిస్తుంది. కానీ టెట్ రాసేందుకు 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన ఉంది. దీంతో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు నష్టపోతున్నారని, ఈ అర్హత మార్కులను 40 శాతానికి సడలించారు. ఈ సడలింపు ఈ ఒక్కసారికే ఉంటుందని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏపీలో ఇటీవల టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఉపాధ్యాయ నియామ‌క ప‌రీక్షలో టెట్ కు 20% వెయిటేజీ ఉంటుంది. ఉపాధ్యాయ ఉద్యోగార్థులు 1 నుంచి 5వ తరగతుల బోధనకు పేపర్-1(A, B), ఆరో నుంచి ఎనిమిదో తరగతుల బోధనకు పేపర్-2 (A, B)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. 


మరిన్ని ఉద్యోగ సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి...