విశాఖపట్నంలోని వైద్యారోగ్య సేవల ప్రాంతీయ కార్యాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్/ మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఏపీ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సు లేదా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జనవరి 12లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
వివరాలు..
* కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్‌ఓ)/ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్(ఎంఎల్‌హెచ్‌పీ): 08 పోస్టులు
అర్హత: ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 27.12.2023 నాటికి 18 నుంచి 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు అయిదేళ్ల(40) సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అభ్యర్థులకు రూ.100. అభ్యర్థులు 'Regional Director of Medical and Health Services, Visakhapatnam' పేరిట డిడి తీయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు పొందవచ్చు. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధింత చిరునామాకు చేరేలా పంపాలి. అభ్యర్థులు గూగుల్ ఫాం ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
జీత భత్యాలు: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Office of Regional Director of Medical and Health Services, Visakhapatnam,
Opp: Lanapally Bullayya College,
1st Floor, DM&HO Office compound,
Nakkavanipalem, Visakhapatnam-530013.
దరఖాస్తుకు జతచేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
➥ 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు/ రెసిడెన్స్ సర్టిఫికేట్ కాపీ
➥ పదోతరగతి మార్కుల మెమో కాపీ
➥ ఇంటర్ మార్కుల మెమో కాపీ
➥ బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ నర్సింగ్ (నర్సింగ్‌తోపాటు CPCH కోర్సు) మార్కుల జాబితా కాపీ
➥ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్‌వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కాపీ
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ కాపీ
➥ దివ్యాంగులకు పీహెచ్ సర్టిఫికేట్ కాపీ
➥ ఎక్స్-సర్వీస్‌మెన్ సర్టిఫికేట్ కాపీ
➥ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ కాపీ
ముఖ్యమైన తేదీలు...
➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.12.2023.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 12.01.2024.
➥ అభ్యర్థుల మెరిట్ జాబితా వెల్లడి: 27.01.2024.
➥ అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 31.01.2024.
➥ అభ్యర్థుల తుది మెరిట్ జాబితా వెల్లడి: 07.02.2024.
➥ తుది మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 09.02.2024.
➥ తుది ఎంపిక జాబితా వెల్లడి: 12.02.2024.
➥ కౌన్సెలింగ్ తేదీ: 14.02.2024.