వైఎస్ఆర్ జిల్లా కడప, ప్రొద్దుటూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్, మెడికల్ ఆఫిసర్ పోస్టుల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది. పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 20 సా. 5.30 లోపు ఆఫ్‌లైన్ దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా, కడప చిరునామాలో అందజేయాలి.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 09


1. హబ్ జీఎంసీ,కడప: 04
జనరల్ ఫిజిషియన్: 01
పీడియాట్రిక్స్: 01
మెడికల్ ఆఫిసర్: 02


2. హబ్, డీహెచ్, ప్రొద్దటూర్: 04
జనరల్ ఫిజిషియన్: 01
పీడియాట్రిక్స్: 01
మెడికల్ ఆఫిసర్: 02


3. ఎస్‌ఎన్‌సీయూ: 01
పీడియాట్రిక్స్: 01


అర్హత: పోస్టుని అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్‌బీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 42 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 47 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.


జీతం: నెలకు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు రూ.53,000, స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులకు రూ.1,00,000.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. 


దరఖాస్తు ఫీజు: రూ.500.


ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్‌లో 75శాతం ఉత్తీర్ణత ఉండాలి. నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.


దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 20.11.2022.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: దరఖాస్తులను వ్యక్తిగతంగా జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, వైఎస్ఆర్ జిల్లా, కడప చిరునామాలో అందజేయాలి.


Notification 


Website 


::Also Read::


అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ దరఖాస్తు ప్రారంభం - అర్హత, ఎంపిక వివరాలివే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు, నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌ అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 15న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు డిసెంబరు 4లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి డిసెంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ (ప్రాక్టికల్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...