చిత్తూరులోని జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్ తాత్కాలిక ప్రాతిపదికన ఆల్కహాల్ అండ్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 06


1. డాక్టర్: 01 పోస్టు


అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏపీ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.


జీతం: నెలకు రూ.60,000.


2. కౌన్సెలర్/ సోషల్ వర్కర్/ సైకాలజిస్ట్: 03 పోస్టులు


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ఫీల్డ్‌లో 1-2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.


జీతం: నెలకు రూ.17,500.


3. వార్డ్ బాయ్: 02 పోస్టులు


అర్హత:  ఎనిమిదోవ తరగతి ఉత్తీర్ణతతో పాటు హాస్పిటల్స్/ హెల్త్ కేర్ సెంటర్స్/డిఅడిక్షన్ సెంటర్స్‌లో పని అనుభవం ఉండాలి.


జీతం: నెలకు రూ.13,000.


వయోపరిమితి: నిబంధనల ప్రకారం.


దరఖాస్తు ఫీజు: రూ.500.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం, జిల్లా హెడ్‌క్వార్టర్స్ హాస్పిటల్, చిత్తూరు చిరునామాకు పంపించాలి. 


ఎంపిక విధానం: నిబంధనల మేరకు.


దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 25.04.2023.




Notification 


Website 


Also Read:


ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 'నైట్‌ వాచ్‌మన్' పోస్టుల మార్గదర్శకాలు జారీ!
ఆంధ్రప్రదేశ్‌లో ‘మనబడి నాడు–నేడు’ పథకంలో భాగంగా వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరు­గు­పరచడానికి ప్రభుత్వం 2020–21 నుంచి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆయా పాఠశాలల్లో దశల వారీగా టాయి­లెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతు­లు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యా­ర్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, ప్రహరీ, కిచెన్‌ షెడ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల డిగ్రీ కాలేజీల్లో 868 డీఎల్, నాన్-టీచింగ్ పోస్టులు - అర్హతలివే!
తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 868 లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 174 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 287 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 407 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో లెక్చరర్ పోస్టులు 785, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 39, లైబ్రేరియన్ పోస్టులు 36 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల జూనియర్ కళాశాలల్లో జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీల్లో వివిధ పోస్టుల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఏప్రిల్ 17న వెలువడింది. దీనిద్వారా 2008 జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 253 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలల్లో 291 పోస్టులు, బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 1070 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో జేఎల్ పోస్టులు 1924, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 34, లైబ్రేరియన్ పోస్టులు 50 ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..