దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్) ఖాళీల భర్తీకి స్పెషల్‌ సైకిల్‌ మే-2023 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 12,828 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి, కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి. దీంతో పాటు మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష వచ్చిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థలు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టుల భర్తీకి మే 22 నుంచి జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వహించాలి.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 12,828.


➥ ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 118


➥ తెలంగాణలో ఖాళీలు: 96


* గ్రామీణ డాక్ సేవక్స్( బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్)


బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం): ఈ ఉద్యోగానికి ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. టీం లీడర్‌గా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.


అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవారు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.


అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష వచ్చి ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.


వయోపరిమితి: 11.06.2023 నాటికి 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి.


ఎంపిక విధానం: అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపడతారు.


జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: 22.05.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 11.06.2023.


➥ దరఖాస్తు సవరణలకు అవకాశం: 12.06.2023 నుంచి 14.06.2023 వరకు.


Notification 


Website



Also Read:


యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II)-2023 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (II)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించింది. ఇక ద్వితియార్ధానికి సంబంధించి సెప్టెంబరు 3న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 227 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్ ఉద్యోగాలు- అర్హతలివే!
ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ)లో 2024 జనవరి నుంచి ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 227 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  ఈ పోస్టులకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


తెలంగాణ జిల్లా కోర్టుల్లో 144 టైపిస్ట్‌ ఉద్యోగాలు, ఎంపికైతే రూ.72 వేల వరకు జీతం!
తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..