DSSSB Recruitment: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) వివిధ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీలోని ఎన్‌సీటీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇతర అనుబంధ సంస్థలలో 432 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు బీఎడ్‌ కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 432 పోస్టులు


⏩ పీజీటీ(హిందీ)- మేల్: 70 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 51, ఓబీసీ- 04, ఎస్సీ- 06, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 07.


⏩ పీజీటీ(హిందీ)- ఫిమేల్: 21 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 07, ఓబీసీ- 02, ఎస్సీ- 04, ఎస్టీ- 05, ఈడబ్ల్యూఎస్- 03.


⏩ పీజీటీ(మ్యాథ్స్)- మేల్: 21
రిజర్వేషన్: యూఆర్- 10, ఓబీసీ- 07, ఎస్సీ- 02, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 02.


⏩ పీజీటీ(మ్యాథ్స్)- ఫిమేల్: 10
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 04, ఎస్సీ- 01, ఎస్టీ- 04, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(ఫిజిక్స్‌)- మేల్: 03 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 02, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(ఫిజిక్స్‌)- ఫిమేల్: 02 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 01, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(కెమిస్ట్రీ)- మేల్: 04 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 03, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(కెమిస్ట్రీ)- ఫిమేల్: 03 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02, ఓబీసీ- 0, ఎస్సీ- 01, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(బయాలజీ)- మేల్: 01 పోస్టు
రిజర్వేషన్: యూఆర్- 0, ఓబీసీ- 01, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(బయాలజీ)- ఫిమేల్: 12 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 04, ఓబీసీ- 06, ఎస్సీ- 02, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(ఎకనామిక్స్)- మేల్: 60 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 31, ఓబీసీ- 22, ఎస్సీ- 02, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 06.


⏩ పీజీటీ(ఎకనామిక్స్)- ఫిమేల్: 22 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 07, ఓబీసీ- 13, ఎస్సీ- 0, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(కామర్స్)- మేల్: 32 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 14, ఓబీసీ- 14, ఎస్సీ- 01, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 03.


⏩ పీజీటీ(కామర్స్)- ఫిమేల్: 05 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 02.


⏩ పీజీటీ(హిస్టరీ.)- మేల్: 50 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 28, ఓబీసీ- 10, ఎస్సీ- 6, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 04.


⏩ పీజీటీ(హిస్టరీ.)- ఫిమేల్: 11 పోస్టులు
రిజర్వేషన్:: యూఆర్- 02, ఓబీసీ- 04, ఎస్సీ- 01, ఎస్టీ- 01, ఈడబ్ల్యూఎస్- 03.


⏩ పీజీటీ(జాగ్రఫీ)- మేల్: 21 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 14, ఓబీసీ- 01, ఎస్సీ- 02, ఎస్టీ- 02, ఈడబ్ల్యూఎస్- 02.


⏩ పీజీటీ(జాగ్రఫీ)- ఫిమేల్: 01 పోస్టు
రిజర్వేషన్: యూఆర్- 01, ఓబీసీ- 0, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 0.


⏩ పీజీటీ(పొలిటికల్‌ సైన్స్‌)- మేల్: 59 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 41, ఓబీసీ- 07, ఎస్సీ- 06, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 05.


⏩ పీజీటీ(పొలిటికల్‌ సైన్స్‌)- ఫిమేల్: 19 పోస్టులు
రిజర్వేషన్: యూఆర్- 11, ఓబీసీ- 03, ఎస్సీ- 03, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 02.


⏩ పీజీటీ(సోషియాలజీ)- మేల్:  05
రిజర్వేషన్: యూఆర్- 02, ఓబీసీ- 01, ఎస్సీ- 0, ఎస్టీ- 0, ఈడబ్ల్యూఎస్- 02.


అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన,  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎడ్‌ కలిగి ఉండాలి.


వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(యూఆర్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఎస్సీ/ఎస్టీ) అభ్యర్థులకు 15 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ(ఓబీసీ) అభ్యర్థులకు 13 సంవత్సరాలు,  ఎక్స్- సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మిలిటరీ సర్వీస్ వ్యవధితో పాటు మరో 03 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: సీబీటీ ఎగ్జామ్‌, మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.


పే స్కేల్: రూ.47,600 -  రూ.1,51,100 (పే లెవెల్-8), గ్రూప్ ‘బి’ (జనరల్ సెంట్రల్ సర్వీస్, నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్) పే స్కేల్ అందుకుంటారు.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2025 


🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14.02.2025


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..