Sub-Inspector in Delhi Police and CAPF Examination, 2024: ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ (CAPF- (బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ) విభాగాల్లో సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్షలకు సంబంధించి అభ్యర్థుల రోల్ నెంబరు, పరీక్ష కేంద్రం వివరాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన లింక్‌ను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి.. రోల్ నెంబరు, పరీక్ష కేంద్రం, పరీక్ష నిర్వహణ తేదీలను తెలుసుకోవచ్చు.


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఎస్‌ఐ పోస్టుల భర్తీకి జూన్ 27 - 29 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంపికైనవారిని ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన(సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల్లో భర్తీచేస్తారు. వీరికి నెలకు రూ.35,400-రూ.1,12,400 జీతంగా ఇస్తారు. ఇతర భత్యాలు అదనంగా ఉంటాయి. ఒకట్రెండు రోజుల్లో పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను విడుదలచేయనున్నారు. 


Know your Roll Number, Time, Date, Shift and Place of Examination


ఢిల్లీ పోలీసు విభాగంతోపాటు కేంద్ర సాయుధ బలగాలైన (సీఏపీఎఫ్‌) బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 4న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 4,187 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో పురుషులకు 3,818 పోస్టులు, మహిళలకు 369 పోస్టులు కేటాయించారు.  సీబీటీ రాతపరీక్ష(పేపర్‌-1, 2), శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.


పోస్టుల వివరాలు..


* ఢిల్లీపోలీసు, సీఏపీఎస్ ఎస్‌ఐ ఎగ్జామినేషన్-2024


ఖాళీల సంఖ్య: 4,187.


1) సీఏపీఎఫ్ - సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ): 4,001 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-1614, ఈడబ్ల్యూఎస్-402, ఓబీసీ-1097, ఎస్సీ-593, ఎస్టీ-295.


2) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు: 125 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-56, ఈడబ్ల్యూఎస్-13, ఓబీసీ-30, ఎస్సీ-17, ఎస్టీ-09.


3) ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- మహిళలు: 61 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్-1614, ఈడబ్ల్యూఎస్-402, ఓబీసీ-1097, ఎస్సీ-593, ఎస్టీ-295.


ఎంపిక విధానం: సీబీటీ రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.


పేపర్-1 పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం నాలుగు విభాగాల నుంచి 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్-50 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.


పేపర్-2 పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్-200 ప్రశ్నలు-200 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు (2 గంటలు). పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కులు కోత విధిస్తారు.


NCC అభ్యర్థులకు బోనస్ మార్కులు..
NCC అభ్యర్థులకు బోనస్ మార్కులు ఉంటాయి. NCC 'C' సర్టిఫికేట్ ఉన్నవాళ్లకు 10 మార్కులు, NCC 'B' సర్టిఫికేట్ ఉన్నవాళ్లకు 6 మార్కులు, NCC 'A' సర్టిఫికేట్ ఉన్నవాళ్లకు 4 మార్కులు బోనస్‌గా వస్తాయి. ఈ బోనస్ మార్కులు పేపర్-1, పేపర్-2 వేర్వేరుగా వర్తింపజేస్తారు. 


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం.


జీతభత్యాలు: నెలకు రూ.35,400-రూ.1,12,400 ఇస్తారు. ఇతర భత్యాలు అదనం.


నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...