Delhi Police Constable Answer Key 2023: ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(Constable Executive) పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిసెంబరు 6న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ(Answer Key)ని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రూల్ నెంబరు, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఆన్సర్ కీ చూసుకోవచ్చు. అదేవిధంగా ఆన్సర్ కీపై ఏమైనా  అభ్యంతరాలుంటే తెలపవచ్చు. అభ్యంతరాలను డిసెంబర్‌ 9లోగా ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది. 


ఢిల్లీ పోలీసు విభాగంలో కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సెప్టెంబరు 1న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 7547 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 3 వరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం రాతపరీక్ష నిర్వహించింది.


మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహించారు. పరీక్షలో ఆబ్జెక్టివ్ విధానంలో 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌-50 ప్రశ్నలు-50 మార్కులు, రీజనింగ్‌ 25 ప్రశ్నలు-25 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ-15 ప్రశ్నలు-15 మార్కులు, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.


రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తర్వాతి దశలో ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు పే లెవల్-3 (రూ.21,700-రూ.69,100) ప్రకారం జీత భత్యాలు ఉంటాయి.


ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ నియామక పరీక్ష ప్రశ్నపత్రం, కీ కోసం క్లిక్‌ చేయండి..




పోస్టుల వివరాలు..


* కానిస్టేబుల్ పోస్టులు


1) కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302.


2)  కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు 


పోస్టుల కేటాయింపు: జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150.


Notification


ALSO READ:


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులు
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 15లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...