CSIR UGC NET (December) 2023 Admit Card: సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్) డిసెంబర్-2023 అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డిసెంబరు 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని ముఖ్య కేంద్రాల్లో డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
సీఎస్‌ఐఆర్ నెట్ పరీక్షను మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. కెమికల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్(అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్), లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్. మొత్తం 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. అవి పార్ట్–ఎ, పార్ట్–బి, పార్ట్–సి. పరీక్ష సమయం 3 గంటలు(180 నిమిషాలు).
➥ ప్రతి సబ్జెక్టు నుంచి మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షలో సబ్జెక్టుల వారీగా నెగెటివ్ మార్కులు ఉంటాయి.పరీక్ష పేపర్‌లో మూడు (పార్ట్-ఎ, పార్ట్-బి, పార్ట్-సి) విభాగాలుంటాయి.
➥'పార్ట్-ఎ' విభాగంలో జనరల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, గ్రాఫికల్ అనాలసిస్, అనలిటికల్ & న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ కంపారిజన్, సిరీస్, ఇతర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
➥ 'పార్ట్-బి' విభాగంలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలుంటాయి. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్టులను అనుసరించి భిన్నంగా ఉంటుంది. కెమికల్ సైన్సెస్ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 35 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.5శాతం మార్కుల కోత విధిస్తారు. ఎర్త్ సైన్సెస్, లైఫ్ సైన్సె విభాగాల నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 35 ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.5 శాతం మార్కుల కోత ఉంటుంది. మ్యాథమెటికల్ సైన్సెస్ నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో 25 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.75శాతం మార్కులను కోతగా విధిస్తారు. ఫిజికల్ సైన్సెస్‌లో 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 3.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.875శాతం మార్కుల కోత ఉంటుంది.
➥ 'పార్ట్-సి' విభాగంలో అభ్యర్థి స్కిల్స్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్టులోని శాస్త్రీయ అనువర్తనాలను అన్వయించే నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో అడిగే ప్రశ్నల సంఖ్య ఆయా సబ్జెక్టులను అనుసరించి భిన్నంగా ఉంటాయి. కెమికల్ సైన్సెస్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. వీటిలో ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులను కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. ఎర్త్ సైన్సెస్‌లో 80 ప్రశ్నల్లో 25 ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1.32శాతం మార్కుల కోత విధిస్తారు. లైఫ్ సైన్స్ విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇస్తారు. 25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. సరైన సమాధానానికి 4 మార్కును కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత ఉంటుంది. మ్యాథమెటికల్ సైన్సెస్‌లో 60 ప్రశ్నలుంటాయి. 20 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ప్రతి ప్రశ్నకు 4.75 మార్కుల చొప్పున ఈ విభాగంలోని ప్రశ్నలకు కేటాయించారు. ఇందులో నెగిటివ్ మార్కులు లేవు. ఫిజికల్ సైన్సెస్‌లో 30 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో 20 ప్రశ్నలకు సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 5 మార్కులు ఇస్తారు, తప్పు సమాధానానికి 1.25శాతం మార్కుల కోత విధిస్తారు. విభాగాల్లో సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రాత పరీక్ష ఎప్పుడు..?
డిసెంబరు 26, 27, 28 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉ.9.00 గం.- మ.12.00 గం. వరకు మొదటి సెషన్‌లో, మ. 2.00 గం.-సా.5.00 గం. వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 225 నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రధాన నగరాల హైదరాబాద్, గుంటూరులో పరీక్ష నిర్వహణ ఉంటుంది.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, ప్రొద్దుటూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, సూరంపాలెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ (డిసెంబరు) 2023 నోటిఫికేషన్
ALSO READ:
➥ ఐడీబీఐ ఉద్యోగాల రాతపరీక్ష అడ్మిట్‌కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
➥ ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష షెడ్యూలు విడుదల, ఎప్పుడంటే?
➥ స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలో ఉచిత శిక్షణ