CSIR- IICT Recruitment: హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(CSIR-IICT) ఖాళీగా ఉన్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 03 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది. సీబీటీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక చేస్తారు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 15


⏩ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(జనరల్‌): 10 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్ - 04, ఎస్సీ- 02, ఎస్టీ- 01, ఓబీసీ- 02, ఈడబ్ల్యూఎస్- 01.


⏩ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌): 02 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్ - 01, ఓబీసీ- 01.


⏩ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్(ఎస్‌ అండ్‌ పీ): 03 పోస్టులు


పోస్టుల కేటాయింపు: యూఆర్ - 01, ఓబీసీ- 01.


విభాగాలు: జనరల్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ఎస్‌ అండ్‌ పీ తదితరాలు.


అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష ఇంగ్లీష్ అండ్ హిందీ మాధ్యమంలో ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం 200 ప్రశ్నలు అడుగుతారు. సమయం: 2 గంటల 30 నిమిషాలు. ఈ పోస్టులకు, రెండు పేపర్లు (పేపర్- I అండ్ పేపర్ -II) ఉంటాయి.


పేపర్- I: మెంటల్ ఎబిలిటీ టెస్ట్*- 100 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 200 మార్కులు. ఈ పేపర్‌లో నెగిటివ్ మార్కులు ఉండవు. సమయం: 90 నిమిషాలు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిట్యుయేషనల్ జడ్జిమెంట్ మొదలైన వాటి మీద ప్రశ్నలు అడుగుతారు.


పేపర్ -II: సమయం: 1 గంట.


➥ జనరల్ అవేర్‌నెస్- 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 150 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగటివ్ మార్కు చొప్పున కోత విధిస్తారు. 
➥ ఇంగ్లీషు లాంగ్వేజ్- 50 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 150 మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగటివ్ మార్కు చొప్పున కోత విధిస్తారు. 


జీతం: నెలకు రూ.38,483.


ముఖ్యమైన తేదీలు..


🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31.01.2025.


🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 03.03.2025.


Notification


Website


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..