Oru Jaathi Jaathakam faces ban in Gulf countries: రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు ఉండగా ఓ సినిమా బ్యాన్‌కు గురైంది. ఇవాళ(జనవరి 31న) ప్రముఖ నటుడి కామెడీ డ్రామా థియేటరర్‌లో విడుదలకు సిద్దమైంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమాపై బ్యాన్ విధించడంతో సదరు మూవీ టీంకి షాక్ తగిలింది. ఇంతకి అదే మూవీ, ఆ సినిమా బ్యాన్ అవ్వడానికి కారణాలేంటో ఇక్కడ చూద్దాం. ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు వినీత్ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఒరు జాతి జాతకం'. ఎం. మోహనన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. 'వర్షాంగల్కు శేషం' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వినీత్ శ్రీనివాస్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీ మాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ దేశాల్లో బ్యాన్
అయితే మలయాళ స్టార్ హీరోలు, ప్రముఖ నటుల చిత్రాలు గల్ఫ్ దేశంలోనూ రిలీజ్ అవుతాయనే విషయం తెలిసిందే. అలాగే ఒరు జాతి జాతకం సినిమాను గల్ప్ దేశాల్లో భారీ ఎత్తున రిలీజ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇక నేడు జవనరి 31న ఈ సినిమా భారత్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోనూ విడుదల కావాల్సి ఉంది. అయితే సడెన్‌గా అక్కడ ఈ మూవీ రిలీజ్‌ని నిలిపివేసి బ్యాన్ విధించారు. ఈ సినిమాలో LGBTQ+ కమ్యునిటీకి సంబంధించి పలు సన్నివేశాలు ఉండటం వల్లే ఈ మూవీని బ్యాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆ కారణం చేత ఓమన్ దేశం మినహా మిగతా గల్ఫ్ దేశాల్లో ఆ సినిమాపై బ్యాన్ విధించడం మూవీ టీం గట్టి దెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే గల్ఫ్ దేశాల్లో మలయాళ సినిమాలకు ఇలాంటి అనుభవాలు ఎదురవ్వడం కొత్తేమి కాదు. గతంలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సినిమాలకు సైతం గల్ఫ్ దేశాల్లో బ్యాన్‌ను ఎదుర్కొన్నాయి.
బ్యాన్ కి కారణమిదే!
వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడా. సినిమాలు తెరకెక్కిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై అలరిస్తుంటారు. ఇక ఆయన ఎక్కవగా కామెడీ జానర్‌లోనే నటిస్తారు. ఈ క్రమంలో ఒరు జాతి జాతకం చిత్రంలో ఆడియన్స్ నవ్వించేందుకు సిద్ధమైన ఆయనకు మూవీపై బ్యాన్ విధించడంతో ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. అయితే మూవీపై బ్యాన్ విధించేంతగా ఆ సినిమాలో ఏముందంటే.. ఈ సినిమాలో హీరో జయేష్‌కి పెద్దగా ఏది కలిసిరాదు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటాడు. అయితే పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి చోట అతడు రిజెక్షన్‌ని ఎదుర్కొంటాడు. దీనికి కారణం అతడు హోమో సెక్సువల్ జెండర్ అనే ప్రచారం ఉంటుంది. దీంతో అతడిపై కొందరు వివక్ష చూపుతుంటారు. దీనిపై అతడిని ఎగతాళి చేస్తుంటారు.
నిజానికి జయేష్ అలాంటి వాడు కాకపోయిన తనపై వచ్చిన ఈ రూమర్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటాడు. పెళ్లి చూపులకు వెళ్లిన ప్రతి చోట అతడు తిరస్కరణకు గురవుతాడు. అదే సమయంలో జయేష్ ఓ జ్యోతిష్యురాలిని కలుసుకుంటాడు. చేయి చూసి జాతకం చెప్పడంలో సిద్ధహత్తురాలైన ఆ మహిళను కలుసుకున్న తర్వాత హీరో జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. మరి అతడు కోరుకున్న అమ్మాయి అతడి జీవితంలోకి వచ్చిందా? తనపై వచ్చిన ఈ నిందను అబద్దమని ఎలా ప్రూవ్ చేసుకున్నాడనేది సనిమా చూసి తెలుసుకోవాల్సిందే. నిఖిలా విమల్ హీరోయిన్‌గా నటించింది ఈ సినిమా గతేడాది ఆగష్టు 22న విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడింది. ఆ తర్వాత అడ్డంకులను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ చిత్రం శుక్రవారం (జనవరి 31) థియేటర్‌లోకి వచ్చింది.