CSIR- IGIB Recruitment 2023: సీఎస్ఐఆర్ ఆధ్వర్యంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ(ఐజీఐబీ) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 16 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఎస్సీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 16
టెక్నికల్ అసిస్టెంట్
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(1)
సీనియర్ టెక్నికల్ ఆఫీసర్(2)
పీఆర్. టెక్నికల్ ఆఫీసర్
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 28-45 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, స్క్రీనింగ్ కమిటీ, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.35400-రూ.215900 చెల్లిస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.09.2023
ALSO READ:
1324 జేఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఎంపికైతే జీతమెంతో తెలుసా?
కేంద్రప్రభుత్వరంగ సంస్థల్లోని జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జులై 26 నోటిఫికేషన్ జారీచేసింది. దీనిద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని జూనియర్ ఇంజినీర్ (సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్) పోస్టులను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు జులై 26 నుంచి ఆగస్టు 16 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 105 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీలు
BARC JRF Notification: ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కల్పించే ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభంకాగా.. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..
1876 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - అర్హతలు, ఇతర వివరాలు ఇలా!
ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌లో 1876 ఎస్‌ఐ (గ్రౌండ్ డ్యూటీ), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ (SSC CPO 2023) విడుదల చేసింది. బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమాబల్ విభాగాలు సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ కిందకు వస్తాయి. మొత్తం ఖాళీల్లో 1710 పురుషులకు కేటాయించగా.. 166 పోస్టులను మహిళలకు కేటాయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి జులై 21న నోటిఫికేషన్ విడుదలకాగా.. జులై 22 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..