CSIR-CBRI: సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్‌ ఉద్యోగాలు, ఈ అర్హతలుండాలి

సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖాళీగా ఉన్న సైంటిస్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Continues below advertisement

CSIR-CBRI Recruitment: ఉత్తరఖంఢ్ రాష్ట్రం రూర్కీలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌, సినియర్‌ సైంటిస్ట్‌, సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో పీజీ, ఎంఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. మార్చి 05 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. సరైన అర్హత గల అభ్యర్ధులు ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Continues below advertisement

వివరాలు..

ఖాళీల సంఖ్య: 31

⏩ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌: 02 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 02.

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ(ఇంజినీరింగ్-ఆర్కిటెక్చర్, సైన్సెస్- ఫిజిక్స్) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.  

జీతం: నెలకు రూ.1,23,100.

⏩ సినియర్‌ సైంటిస్ట్‌: 02 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 02.

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ(సైన్సెస్- జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియోసైన్సెస్/ఎర్త్ సైన్సెస్/ ఫిజికల్ సైన్సెస్, బోటనీ) లేదా తత్సమానం ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 37 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.  

జీతం: నెలకు రూ.78,800. 

⏩ సైంటిస్ట్‌: 27 పోస్టులు

రిజర్వేషన్: యూఆర్- 12, ఎస్సీ- 04, ఎస్టీ- 02, ఓబీసీ(ఎన్‌సీఎల్)- 04, ఈడబ్ల్యేఎస్- 05, పీడబ్ల్యూబీడీ- 04.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఆర్క్‌, ఎంఈ/ ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.  

జీతం: నెలకు రూ.67,700.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: 

➥ ఉన్నత విద్యార్హతల ఆధారంగా

➥ సంబంధిత రంగంలో కావాల్సిన అర్హతలు లేదా అనుభవం ఆధారంగా

➥ దాఖలు చేసిన పేటెంట్ ఆధారంగా, SCI/Peer రివ్యూడ్ జర్నల్స్‌లో పబ్లికేషన్‌లు మొదలైనవి

➥ సైంటిఫిక్ జర్నల్ పబ్లికేషన్స్ యొక్క క్వాలిటి, నంబరు అండ్ రచయితత్వం (అంటే మొదటి రచయిత లేదా సహ రచయిత, సంబంధిత రచయిత మొదలైనవి) ఆధారంగా

➥ పరిశోధన స్పెషలైజేషన్ ఆధారంగా

➥ రాత పరీక్ష/సెమినార్ ఆధారంగా

➥ ముఖ్యమైన అర్హతలు పొందిన తర్వాత అనుభవాన్ని లెక్కించడం ద్వారా

➥ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ (EQ) లేదా డిజైరబుల్ క్వాలిఫికేషన్ (DQ) గా పేర్కొనబడిన అనుభవం లేని సందర్భాల్లో కూడా అనుభవాన్ని కోరడం ద్వారా
స్క్రీనింగ్ కమిటీ తగినదని భావించే ఏదైనా ఇతర పద్ధతి.

➥ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రాంరంభం: 05.03.2025.

🔰 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.04.2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement