సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీఆర్‌పీఎఫ్‌ హాస్పిటల్స్‌లో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 18 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 10వ తేదీన ఇంటర్వ్యూకి హజరు కావాల్సిఉంటుంది.


వివరాలు..


* స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్


మొత్తం ఖాళీలు: 18


విభాగాలు: అనస్థీషియా, సర్జరీ, రేడియాలజీ, ఆప్తాల్మాలజీ, మెడిసిన్, ఒబెస్ట్ట్రిక్స్&గైనకాలజీ.


అర్హత: సంబంధిత స్పెషాలిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 70 సంవత్సరాలు మించకూడదు.


జీతభత్యాలు: రూ.85,000.


ఇంటర్వ్యూ తేదీ: 10.07.2023.


వేదిక: అజ్‌మేర్, భువనేశ్వర్, రాంపూర్, నీముచ్, రాంచీ, బిలాస్‌పూర్‌, జగదల్‌పూర్‌, పల్లిపురం, గువాహటి, సిల్చార్, ఇంఫాల్‌లోని సీఆర్‌పీఎఫ్‌ కాంపోజిట్ హాస్పిటళ్లలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


Notification 


Website


Also Read:


గురుకులాల్లో 9,210 పోస్టుల పరీక్ష తేదీలు ఖరారు! ఎగ్జామ్స్ ఎప్పుడంటే?
తెలంగాణలోని గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష తేదీలను గురుకుల విద్యాలయాల సంస్థ ఖరారు చేసింది. ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షల పూర్తి షెడ్యూలును ఒకట్రెండుల్లో వెల్లడించనున్నట్టు తెలంగాణ గురుకుల విద్యాలయ సంస్థ నియామక బోర్డు కన్వీనర్ డా. మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు తెలిపారు. తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో మొత్తం 9210 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. మొత్తం 9 నోటిఫికేషన్లను గురుకుల నియామక బోర్డు విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 2.63 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


గురుకుల పోస్టుల దరఖాస్తుల సవరణ, ఈ తేదీల్లోనే అవ‌కాశం!
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో 9,231 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువడిన సంగ‌తి తెలిసిందే. అర్హత గ‌ల అభ్యర్థుల నుంచి ఇప్పటికే ద‌ర‌ఖాస్తులు స్వీకరించారు. అయితే అభ్య‌ర్థుల‌కు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించింది గురుకుల నియామ‌క బోర్డు. అభ్య‌ర్థులు ఒకసారి మాత్రమే త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. ఎడిట్ చేసిన ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసుకుని భ‌ద్ర‌ప‌రుచుకోవాని సూచించారు.
దరఖాస్తుల సవరణ పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 35 జూనియర్ ఇంజినీర్ పోస్టులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 35 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..