CRPF Constable Recruitment: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ (Constable-General Duty)  నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 169 (మేల్- 83, ఫిమేల్- 86)


* కానిస్టేబుల్ పోస్టులు (జనరల్ డ్యూటీ)


క్రీడా విభాగాలవారీగా ఖాళీలు..


➥ జిమ్నాస్టిక్: 06 పోస్టులు


➥ జూడో: 06 పోస్టులు


➥ వుషు: 09 పోస్టులు


➥ షూటింగ్: 09 పోస్టులు


➥ బాక్సింగ్: 05 పోస్టులు


➥ అథ్లెటిక్స్: 22 పోస్టులు


➥ ఆర్చరీ: 06 పోస్టులు


➥ రెజ్లింగ్ ఫ్రీ స్టైల్: 10 పోస్టులు 


➥ గ్రీకో రోమన్: 01 పోస్టు


➥ తైక్వాండో: 05 పోస్టులు


➥ వాటర్ స్పోర్ట్స్ కయాక్: 04 పోస్టులు


➥ కానో: 02 పోస్టులు


➥ రోయింగ్: 02 పోస్టులు


➥ బాడీబిల్డింగ్: 02 పోస్టులు


➥ వెయిట్‌లిఫ్టింగ్: 07 పోస్టులు


➥ స్విమ్మింగ్: 14 పోస్టులు 


➥ ట్రయత్లాన్: 01 పోస్టు


➥ డైవింగ్: 05 పోస్టులు


➥ కరాటే: 06 పోస్టులు


➥ యోగా: 05 పోస్టులు


➥ ఈక్వెస్ట్రియన్: 10 పోస్టులు


➥ యాచింగ్: 10 పోస్టులు


➥ ఐస్ హాకీ: 08 పోస్టులు


➥ ఐస్ స్కేటింగ్: 08 పోస్టులు


➥ ఐస్ స్కీయింగ్: 04 పోస్టులు


అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 15.02.2024 నాటికి 18 - 23 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: సంబంధిత క్రీడాంశంలో ప్రతిభ, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.


జీత భత్యాలు: రూ.21,700 - రూ.69,100.


ఆన్‌లైన్‌ ‌దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.


Notification


Apply Online


Website


ALSO READ:


ఈసీఐఎల్‌ హైదరాబాద్‌లో 1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్‌ ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్/ ఎలక్ట్రీషియన్/ ఫిట్టర్ ట్రేడ్స్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. ఏడాది అప్రెంటిస్‌షిప్‌తో పాటు ప్రభుత్వ రంగ ఎలక్ట్రానిక్ సంస్థల్లో రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జనవరి 16 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం ఖాళీల్లో ఎస్సీ- 176, ఎస్టీ- 77, ఓబీసీ- 296, యూఆర్- 440, ఈడబ్ల్యూఎస్- 111 పోస్టులు కేటాయించారు. ఐటీఐ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..