ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పెద్ద జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. CRPF తన కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2026 (Constable Tradesman Recruitment 2026) కింద ఏకంగా 9195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత ఉన్నవారు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మే 19 వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. 

Continues below advertisement

వయోపరిమితి (Age Limit)

CRPF రిక్రూట్‌మెంట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లుగా నిర్ణయించారు. సిపాయి డ్రైవర్ పోస్టుకు 21 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాల వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసును జనవరి 1, 2026 ఆధారంగా లెక్కిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాల వారికి ఇందులో మినహాయింపు ఉంటుంది.

Continues below advertisement

అభ్యర్థులకు అర్హత ఏం ఉండాలి ? అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పాస్ అయి ఉండాలి. కానిస్టేబుల్ డ్రైవర్, మోటార్ మెకానిక్ వెహికల్ వంటి సాంకేతిక పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో టెక్నికల్ ఎలిజబిలిటీ లేదా తగిన అనుభవం కూడా అవసరం.

శారీరక ప్రమాణాలు ఎంత ఉండాలిపురుష అభ్యర్థులకు - జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎత్తు కనీసం 170 సెం.మీ ఉండాలి. ఎస్టీ అభ్యర్థులు అయితే కనీసం 162.5 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఛాతి 80 నుండి 85 సెం.మీ మధ్య ఉండాలి.

మహిళా అభ్యర్థులు - జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 157 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎస్టీ వర్గ అభ్యర్థులు కనీసం 150 సెం.మీ ఎత్తు ఉండాలి 

సీఆర్పీఎఫ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ

  • మొదట CBT రాత పరీక్ష నిర్వహిస్తారు

  • ఆ తరువాత PET (Physical Efficiency Test)

  • తరువాత PST (Physical Standard Test) చేస్తారు

  • మీ సర్టిఫికెట్స్ పరిశీలన (Document Verification)

  •  చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ (Medical Examination) చేస్తారు

అప్లికేషన్ ఫీజు ఎంత ఎంత?

ఈ CRPF రిక్రూట్‌మెంట్ కోసం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, మాజీ సైనికోద్యోగులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

జీతం ఎంత ఇస్తారుఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 (Pay Level-3) ప్రకారం శాలరీ లభిస్తుంది. ఇందులో ప్రారంభ జీతం నెలకు రూ. 21,700 నుండి గరిష్టంగా 69,100 వరకు ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

దరఖాస్తు చేయడం ఎలా?

  1. ముందుగా మీరు CRPF అధికారిక వెబ్‌సైట్ rect.crpf.gov.in కి వెళ్ళండి.

  2. హోంపేజీలో CRPF Constable Tradesman Recruitment 2026 లింక్‌పై క్లిక్ చేయండి.

  3. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

  4. అప్లికేషన్ ఫారమ్‌లో అన్ని వివరాలను ఫిల్ చేయాలి. 

  5. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని అప్‌లోడ్ చేయండి.

  6. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసిన తరువాత వచ్చే ఫాంను ఫ్యూచర్ అవసరాల కోసం పీడీఎఫ్ సేవ్ చేసుకోండి. అవసరమైతే ప్రింటౌట్‌ తీసి పెట్టుకోవడం మంచిది.