Best Torque Converter Automatic SUVs Under Rs 15 Lakh in India: ఇండియాలో కొత్త కారు కొనాలనుకునే వారు ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఏఎమ్‌టీ (AMT), సీవీటీ (CVT), డీసీటీ (DCT) వంటి రకాలు ఉన్నప్పటికీ, చాలామంది ఇప్పటికీ 'టార్క్‌ కన్వర్టర్' (Torque Converter) గేర్‌బాక్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ టెక్నాలజీ ఇచ్చే స్మూత్ డ్రైవింగ్ అనుభవం, తక్కువ మెయింటెనెన్స్. ఎండలు ముదురుతున్న తరుణంలో, ట్రాఫిక్‌లో విసుగు లేకుండా ప్రయాణించడానికి రూ. 15 లక్షల లోపు అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఎస్‌యూవీలను ఇప్పుడు చూద్దాం.

Continues below advertisement

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx)..ఈ లిస్టులో ఉన్న ఏకైక మైక్రో-ఎస్‌యూవీ ఇదే. మారుతి కార్లలో స్పోర్టీ లుక్ తో పాటు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే మోడల్ ఇది. ఇందులో 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. దీనికి 6-స్పీడ్ టార్క్‌ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. నగరాల్లో చకచకా దూసుకుపోవడానికి, హైవేలపై వేగంగా వెళ్లడానికి ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఏఎమ్‌టీ గేర్‌బాక్స్ తో పోలిస్తే ఇందులో గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది.

 మారుతి సుజుకి బ్రెజ్జా (Brezza)..కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అత్యంత నమ్మకమైన కారు బ్రెజ్జా. ఇందులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. దీనికి పాతదైనా, ఎంతో పటిష్టమైన టార్క్‌ కన్వర్టర్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. టర్బోచార్జర్లు, సంక్లిష్టమైన ఎలక్ట్రానిక్స్ లేకపోవడం వల్ల ఈ కారు చాలా కాలం పాటు ఎటువంటి రిపేర్లు లేకుండా పని చేస్తుంది. ఫ్యామిలీతో ప్రయాణించే వారికి ఇది ఒక సేఫ్ ఛాయిస్.

Continues below advertisement

 స్కోడా కైలాక్ (Kylaq)..స్కోడా బ్రాండ్ నుండి ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు ఇదే. యూరోపియన్ డ్రైవింగ్ స్టైల్ ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది. ఇందులో టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో పాటు 6-స్పీడ్ టార్క్‌ కన్వర్టర్ ఉంది. డీసీటీ (DCT) గేర్‌బాక్స్ లలో ఉండే స్టార్టింగ్ ఇబ్బందులు ఇందులో ఉండవు. హైవేలపై కారు చాలా స్టేబుల్ గా ఉండటం దీని ప్లస్ పాయింట్.

కియా సోనెట్ (డీజిల్ ఆటోమేటిక్)..డీజిల్ ఆటోమేటిక్ కార్లు ఇప్పుడు మార్కెట్లో కనుమరుగవుతున్నాయి. అటువంటి సమయంలో కియా సోనెట్ డీజిల్ ఏటీ (AT) ఒక గొప్ప ఆప్షన్ గా నిలుస్తోంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో కూడిన ఈ టార్క్‌ కన్వర్టర్ గేర్‌బాక్స్ భారీ టార్క్‌ను అందిస్తుంది. దీనివల్ల లాంగ్ ట్రిప్స్ లో ఇంధన ఆదా (Fuel Efficiency) ఎక్కువగా ఉంటుంది. ఎఫ్-వై 26 (FY26) లో లక్ష సేల్స్ మార్కును దాటిన ఏకైక కియా మోడల్ ఇదే కావడం విశేషం.

వోక్స్‌వ్యాగన్ టైగూన్ ఫేస్‌లిఫ్ట్..ఈ లిస్టులో ఉన్న అత్యంత అడ్వాన్స్‌డ్ కారు టైగూన్ ఫేస్‌లిఫ్ట్. ఎందుకంటే 8-స్పీడ్ టార్క్‌ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫర్ చేస్తున్న ఏకైక ఎస్‌యూవీ ఇదే. ఎక్కువ గేర్లు ఉండటం వల్ల ఇంజిన్ పవర్ అన్ని వేగాల్లోనూ సమానంగా అందుతుంది. డ్రైవింగ్ అంటే ప్రాణం ఇచ్చే ఎంథూసియాస్టులకు ఈ కారు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

టార్క్‌ కన్వర్టర్ ఎందుకు బెస్ట్?సిటీ ట్రాఫిక్ లో పదే పదే గేర్లు మార్చాల్సిన అవసరం ఉండదు. ఏఎమ్‌టీ లలో ఉండే జర్క్స్ (Jerks) ఇందులో కనిపించవు. వేడి వాతావరణంలో కూడా ఈ గేర్‌బాక్స్ లు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మీరు కూడా మీ పాత కారుని అప్‌గ్రేడ్ చేసి ఒక మంచి ఆటోమేటిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, పైన చెప్పిన మోడళ్లు ఒకసారి పరిశీలించొచ్చ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.