Cotton University: గువాహటిలోని కాటన్‌ యూనివర్సిటీ రెగ్యులర్‌ ప్రాతిపదికన టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 167 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. యూజీసీ నిబంధనల మేరకు విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల కాపీలను ఈమెయిల్ లేదా సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఇతర అర్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 167.


➥ ప్రొఫెసర్‌: 21


➥ అసోసియేట్ ప్రొఫెసర్‌: 46 


➥ అసిస్టెంట్ ప్రొఫెసర్‌:100 


పోస్టుల వివరాలు ఇలా..


🔰 ప్రొఫెసర్‌: 21 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


సబ్జె్క్టులవారీగా ఖాళీలు: ఆంత్రోపాలజీ-01, ఆర్కియోలజీ-01, బోటనీ-01, కంప్యూటర్ సైన్స్ & ఐటీ-01, ఎకనామిక్స్-01, ఎడ్యుకేషన్-01, ఇంగ్లిష్-01, జియోలజీ-01, హిస్టరీ-01, లా-01, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్-01, మాస్ కమ్యూనికేషన్-జర్నలిజం & మీడియా స్టడీస్-01, మ్యాథమెటిక్స్-01, ఫిలాసఫీ-01, ఫిజిక్స్-01, పొలిటికల్ సైన్స్-01, సైకాలజీ-01, సంస్కృతం-01, స్టాటిస్టిక్స్-01, జువాలజీ-01.


🔰 అసోసియేట్ ప్రొఫెసర్‌: 46 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


సబ్జె్క్టులవారీగా ఖాళీలు: ఆంత్రోపాలజీ-01, ఆర్కియోలజీ-01, బోడో-01, కామర్స్-02, కంప్యూటర్ సైన్స్ & ఐటీ-03, సెంటర్ ఫర్ క్లౌడ్స్ & క్లైమేట్ ఛేంజ్ రిసెర్చ్-01,సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్-01, ఎకనామిక్స్-02, ఎడ్యుకేషన్-03, ఇంగ్లిష్-01, ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ & వైల్డ్‌లైఫ్ సైన్స్-01, జియోలజీ-01, హిందీ-02, హిస్టరీ-02, లా-02, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్-01, మాస్ కమ్యూనికేషన్-జర్నలిజం & మీడియా స్టడీస్-01, మాలిక్యులర్ బయాలజీ & బయోటెక్నాలజీ-01, మ్యాథమెటిక్స్-01, ఫిలాసఫీ-01, ఫిజిక్స్-03, పొలిటికల్ సైన్స్-03, సైకాలజీ-03, సంస్కృతం-01, సోషియాలజీ-02, స్టాటిస్టిక్స్-01, జువాలజీ-02.


🔰 అసిస్టెంట్ ప్రొఫెసర్‌:100 పోస్టులు


అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


సబ్జె్క్టులవారీగా ఖాళీలు: ఆంత్రోపాలజీ-02, ఆర్కియోలజీ-03, అస్సామీ-02, బోడో-01, బోటనీ-02, సెంటర్ ఫర్ క్లౌడ్స్ & క్లైమేట్ ఛేంజ్ రిసెర్చ్-01, సెంటర్ ఫర్ లాంగ్వేజ్, కల్చర్ & ఆర్ట్స్-06, సెంటర్ ఫర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యోగా, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్)-03, కెమిస్ట్రీ-04, కామర్స్-04, కంప్యూటర్ సైన్స్ & ఐటీ-04, ఎకనామిక్స్-04, ఎడ్యుకేషన్-03, ఇంగ్లిష్-02, ఎన్విరాన్‌మెంటల్ బయాలజీ & వైల్డ్‌లైఫ్ సైన్స్-02, జియోగ్రఫీ-02, జియోలజీ-03, హిందీ-01, హిస్టరీ-03, లా-04, లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సైన్స్-04, మాస్ కమ్యూనికేషన్-జర్నలిజం & మీడియా స్టడీస్-04, మాలిక్యులర్ బయాలజీ & బయోటెక్నాలజీ-03, మ్యాథమెటిక్స్-05, ఫిలాసఫీ-01, ఫిజిక్స్-04, పొలిటికల్ సైన్స్-04, సైకాలజీ-05, సంస్కృతం-02, సోషియాలజీ-03, స్టాటిస్టిక్స్-02, జువాలజీ-06.


దరఖాస్తు ఫీజు: రూ.2000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు కాపీలను ప్రింట్ తీసి సంబంధిత చిరునామాకు లేదా పీడీఎఫ్ ఫార్మాట్‌లోకి మార్చి సంబంధిత ఈమెయిల్ చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఏపోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నామో ఈమెయిల్ సబ్జె్క్టులేదా హార్డ్‌కాపీలు పంపే కవర్ లెటర్ మీద 'Application for the post of ______ in the department of ____ ' రాయాల్సి ఉంటుంది.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
The Registrar, 
Cotton University, 
Panbazar, Guwahati-781001, 
Assam, India.


దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: recruit2024@cottonuniversity.ac.in


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.04.2024.


➥ దరఖాస్తు హార్డ్‌‌కాపీల పంపేందుకు చివరితేది: 08.04.2024.


Notification


Online Application


Website