Cotton Corporation Of India Limited Recruitment: నేవీ ముంబయిలోని 'కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 214 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏ, బీఎస్సీ, బీకాం, లా డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి జూన్ 12న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిచేస్తారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 214.
⫸ అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): 01 పోస్టుఅర్హత: కనీసం 50 శాతం మార్కులతో న్యాయశాస్త్రంలో డిగ్రీ (3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు) కలిగి ఉండాలి. అనుభవం: అడ్వొకేట్‌గా కనీసం ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. లేదా ఏదైనా న్యాయసేవా సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు.
⫸ అసిస్టెంట్ మేనేజర్(అఫీషియల్ లాంగ్వేజ్): 01 పోస్టుఅర్హత: కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ (హిందీ) కలిగి ఉండాలి. డిగ్రీ వరకు ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ ట్రాన్స్‌లేషన్ అర్హత ఉన్నవారికి ప్రాధ్యాన్యమిస్తారు.అనుభవం: కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.వయోపరిమితి: 32 సంవత్సరాలకు మించకూడదు. ⫸ మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 11 పోస్టులుఅర్హత: ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్/అగ్రికల్చర్) అర్హత ఉండాలి.వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
⫸ మేనేజ్‌మెంట్ ట్రైనీ (అకౌంట్స్): 20 పోస్టులుఅర్హత: సీఏ/సీఎంఏ అర్హత ఉండాలి.వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
⫸ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్: 120 పోస్టులుఅర్హత: 50 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
⫸ జూనియర్ అసిస్టెంట్ (జనరల్): 20 పోస్టులుఅర్హత: 50 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
⫸ జూనియర్ అసిస్టెంట్ (అకౌంట్స్): 40 పోస్టులుఅర్హత: 50 శాతం మార్కులతో బీకామ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
⫸ జూనియర్ అసిస్టెంట్ (హిందీ ట్రాన్స్‌లేటర్): 01 పోస్టుఅర్హత: డిగ్రీ (హిందీ)/ పీజీ డిగ్రీ (హిందీ). ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. హిందీ, ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ తెలిసి ఉండాలి. సంస్కృతంతోపాటు ఇతర భారతీయ భాషలపై అవగాహన ఉండాలి. జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉండాలి.వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: ముంబయి/ నేవీ ముంబయి, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్.
జీతం: నెలకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు రూ.40,000- రూ.1,40,000. మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000. ఇతర పోస్టులకు రూ.22,000-రూ.90,000.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12.06.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024.
ALSO READ: