CLW Recruitment: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం చిత్తరంజన్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ 2024-25 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 27.03.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు అప్రెంటిస్ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఏప్రిల్ 18లోగా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 492

* యాక్ట్‌ అప్రెంటిస్ పోస్టులు

ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, పెయింటర్.

ట్రేడుల వారీగా ఖాళీలు..

➥ ఫిట్టర్- 200 పోస్టులు

➥ టర్నర్- 20 పోస్టులు

➥ మెషినిస్ట్- 56 పోస్టులు

➥ వెల్డర్(జీ&ఈ)- 88 పోస్టులు

➥ ఎలక్ట్రీషియన్- 112 పోస్టులు

➥ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్స్- 04 పోస్టులు

➥ పెయింటర్(జీ)- 12 పోస్టులు

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 27.03.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా.

స్టైఫెండ్: నిబంధనల ప్రకారం.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.04.2024.

Notification

 Apprenticeship Application Portal  

Website

ALSO READ:

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎపుడంటేAAI Recruitment 2024: న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా- దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ కార్యాలయాల్లో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ గేట్‌- 2024 స్కోరు కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 01.05.2024 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు మే 1వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. గేట్‌ 2024 స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

నిట్‌-కురుక్షేత్రలో ఫ్యాకల్టీ పోస్టులు, ఈ అర్హతలుండాలిNITK Recruitment: కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 77 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.2000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..