ఏపీ వైద్యారోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్  పోస్టుల భర్తీకి సెప్టెంబరు 5 నుంచి ప్రారంభంకావాల్సిన వాక్-ఇన్ షెడ్యూలులో మార్పులు చోటుచేసుకున్నాయి. అభ్యర్థులకు సెప్టెంబరు 11, 13, 15 తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రెటరీ ఎం. శ్రీనివాసరావు వెల్లడి ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వాక్-ఇన్ నిర్వహించనున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీ వైద్యవిధాన పరిషత్) ఆస్పత్రులలో ఖాళీగా వున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీ చేయనున్నారు. రెగ్యులర్, కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టనున్నారు. అభ్యర్థులు వాక్‌ఇన్ సమయంలోనే తమ దరఖాస్తులను నేరుగా సమర్పించాల్సి ఉంటుంది. అర్హత, నిర్ణీత మార్గదర్శకాల కోసం అధికారిక  వెబ్‌సైట్ చూడవచ్చు.


విభాగాలవారీగా వాక్-ఇన్ షెడ్యూలు..


* సెప్టెంబరు 11న జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాలకు.


* సెప్టెంబరు 13న  గైనకాలజీ, అనెస్థీషియా, ఈఎన్‌టీ , పాథాలజీ విభాగాలకు.


* సెప్టెంబరు 15న పెడియాట్రిక్స్,  ఆర్థోపెడిక్స్, ఆప్తాల్ మోలజీ,  రేడియాలజీ, గుండె వ్యాధుల విభాగాలకు.


వాక్-ఇన్ వేదిక: డైరెక్టర్ ఆఫ్ సెకండరీహెల్త్ , డోర్ నం.189, బి-బ్లాక్, ఓల్డ్ ఎన్నారై బిల్డింగ్, సొయిపురం కాలనీ, గొల్లపూడి, విజయవాడ.


Website


ALSO READ:


కోనసీమ జిల్లా- ఏపీ సివిల్‌ సప్లయ్ విభాగంలో 993 ఖాళీలు, వివరాలు ఇలా!
కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన వివిధ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 993 టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో సెప్టెంబరు 8 లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఈసీఐఎల్‌లో 163 ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు- ఈ అర్హతలుండాలి
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌), కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్‌ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు.  సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 362 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు, ప్రారంభ వేతనం రూ.30 వేలు
ఇండియన్ నేవీలో ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. పదోతరగతితోపాటు ఐటీఐ విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ప్రతిభతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు అండమాన్‌ అండ్‌ నికోబార్‌ కమాండ్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సంఖ్య అధికంగా వస్తే.. పదోతరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా ఒక్కో పోస్టుకు 25 మంది చొప్పున పరీక్ష రాయడానికి అవకాశం కల్పిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..