ఝార్ఖండ్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ వివిధ నాన్‌టీచింగ్ పోస్ట్‌లతో సహా ఇతర అకడమిక్ & బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపి సంబంధిత ధ్రువపత్రాలను జతచేర్చి హార్డు కాపీలను సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా పంపించాలి.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 37.
పోస్టుల వారీగా ఖాళీలు..
1. ఫైనాన్స్ హిందీ
2. ఇంటర్నల్ ఆడిట్ ఆఫిసర్: 01
3. డిప్యూటీ లైబ్రేరియన్: 01
4. అసిస్టెంట్ లైబ్రేరియన్: 01
5. హిందీ ఆఫిసర్: 01
6. సెక్షన్ ఆఫీసర్: 01
7. ప్రైవేట్ సెక్రటరీ: 02
8. అసిస్టెంట్: 03
9. హిందీ ట్రాన్స్‌లేటర్: 01
10. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01
11. టెక్నికల్ అసిస్టెంట్: 01
12. సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్: 01
13. అప్పర్ డివిజన్ క్లర్క్: 01
14. లాబోరేటరీ అసిస్టెంట్: 03
15. లైబ్రరీ అసిస్టెంట్: 01
16. లోయర్ డివిజన్ క్లర్క్: 06
17. డ్రైవర్: 03
18. లేబొరేటరీ అటెండెంట్: 04
19. లైబ్రరీ అటెండెంట్: 02
20. అటెండెంట్ (హాస్టల్-బాయ్స్: 01& గర్ల్స్: 01): 02
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి, 10+2/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.18000-రూ.144200 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనితో పాటు హార్డు కాపీలను సంబంధిత చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ఫీజు: రూ.1000
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ముఖ్యమైనతేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 18.01.2023.
ఆన్‌లైన్ అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీని పంపడానికి చివరితేదీ: 28.01.2023.
చిరునామా:
To,
The Recruitment Cell
Central University of Jharkhand
Cheri-Manatu Campus, P.O.- Kamre
P.S. - Kanke, Ranchi-835222
(Jharkhand).
Also Read:
యూపీఎస్సీ ఎన్డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (1)-2023 నోటిఫికేషన్ వెల్లడి, దరఖాస్తు ప్రారంభం!
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 'నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ)& నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ (I)- 2023'కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. ఎన్‌డీఏ & ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌ను ప్రతియేటా రెండుసార్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ప్రథమార్దానికి 2023, ఏప్రిల్ 16న రాతపరీక్ష నిర్వహించనుంది.
నోటిఫికేషన్ పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
1392 జేఎల్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జనవరి 10న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి డిసెంబరు 16 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకావాల్సి ఉన్నప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల డిసెంబరు 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 14న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, దరఖాస్తు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...