ఆంధ్రప్రదేశ్‌లోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. రాతపరీక్ష/ అటెండింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. సరైన అర్హతలు గల అభ్యర్ధులు నవంబర్ 10లోపు ఆన్‌లైన్, 20లోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు..

మొత్తం ఖాళీలు: 12 

1) అసిస్టెంట్ లైబ్రేరియన్: 01 పోస్టుఅర్హత: పీహెచ్‌డీ, మాస్టర్స్ డిగ్రీ(లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్) లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ లేదా తత్సమాన ప్రొఫెషనల్ డిగ్రీలో 55% ఉత్తీర్ణత కలిగి ఉండాలి. నెట్/ స్లెట్/ సెట్‌లో అర్హత సాధించాలివయోపరిమితి: 40 సంవత్సరాలు.

2) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 01 పోస్టు  అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయోపరిమితి: 40 సంవత్సరాలు.

3) సెక్షన్ ఆఫీసర్: 01 పోస్టుఅర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.వయోపరిమితి: 35 సంవత్సరాలు.

4) ప్రైవేట్ సెక్రటరీ: 01 పోస్టు అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ.వయోపరిమితి: 35 సంవత్సరాలు.

5) జూనియర్ ఇంజనీర్(సివిల్): 01 పోస్టు అర్హత: సివిల్ లేదా సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ).వయోపరిమితి: 35 సంవత్సరాలు.

6) టెక్నికల్ అసిస్టెంట్ (కంప్యూటర్): 01 పోస్టు అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్‌/టెక్నాలజీలో కంప్యూటర్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ).వయోపరిమితి: 32 సంవత్సరాలు.

7) అప్పర్ డివిజన్ క్లర్క్: 02 పోస్టులు అర్హత: బ్యాచిలర్ డిగ్రీవయోపరిమితి: 32 సంవత్సరాలు.

8) స్టెనోగ్రాఫర్: 02 పోస్టులు అర్హత: బ్యాచిలర్ డిగ్రీవయోపరిమితి: 32 సంవత్సరాలు.

9) లోయర్ డివిజన్ క్లర్క్: 01పోస్టు అర్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయంనుండి 12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.వయోపరిమితి: 30 సంవత్సరాలు.

10) సెక్యూరిటీ అసిస్టెంట్: 01 పోస్టు అర్హత: ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలివయోపరిమితి: 32 సంవత్సరాలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ అటెండింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:

* 1,2 పోస్టులకు జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.2000. ఎస్సీ/ఎస్టీ/పీడభ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.1000.

* 3-10 పోస్టులకు జనరల్/ఓబీసీ అభ్యర్ధులకు రూ.1000. ఎస్సీ/ఎస్టీ/పీడభ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.500. 

చిరునామా: The Recruitment Cell, Central Tribal University of Andhra Pradesh Kondakarakam, Vizianagaram (AP) 535003.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 10.11.2022.

ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేది: 20.11.2022.

Notification

Online Application

Website

 

:: ALSO READ ::

త్వరలో గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు, భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు!తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నోటిఫికేషన్లు విడుదల చేయాలని భావిస్తోంది. మునుగోడు ఎన్నికకు సమయం దగ్గర పడుతుండటంతో ఇక నోటిఫికేషన్ల ప్రకటనకు ఇటు ప్రభుత్వం, అటు టీఎస్‌పీఎస్‌సీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 3న ఎన్నికలు, 6న ఫలితాల వెల్లడితో మునుగోడు ఎన్నికల పర్వం పూర్తవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా గ్రూప్‌-2 లేదా గ్రూప్‌-4, ఇతర నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 322 హెడ్‌‌కానిస్టేబుల్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండిసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ‌స్పోర్ట్స్ కోటా గ్రూప్ సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) నాన్ గెజిటెడ్ అండ్ ​​నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.12వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్రీడా ప్రదర్శన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెరిట్ లిస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్  ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశం, విదేశాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి.

 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...