SSC Constable PET Admitcard Out: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించిన ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రూల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ ఐడీ లేదా పేరుతోపాటు పుట్టినతేదీ తదితర వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్ల అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..

దేశవ్యాప్తంగా 105 పరీక్ష కేంద్రాల్లో సెప్టెంబర్‌ 23 నుంచి అభ్యర్థులకు ఫిజికల్‌ ఈవెంట్లు ప్రారంభం కానున్నాయి. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహించనున్నారు. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్‌ను మినహాయించి మొత్తం 3,10,678 మంది పురుషులు; 39,437 మంది మహిళలు ఫిజికల్ ఈవెంట్లకు ఎంపికయ్యారు. పీఈటీ/ పీఎస్‌టీ పరీక్షల్లో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో మెడికల్ పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అన్ని పూర్తయ్యాక రిజర్వేషన్లకు అనుగుణంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 46,617 పోస్టులు భర్తీ కానున్నాయి. పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగాయి. ఏప్రిల్‌లో ఆన్సర్‌ కీ విడుదల కాగా అభ్యంతరాలను స్వీకరణ.. జులైలో రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది. 

కేంద్ర బలగాల్లో 26,146 కానిస్టేబుల్‌, రైఫిల్‌ మ్యాన్‌ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరు 24న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి నవంబరు 24 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అభ్యర్థులకు ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మార్చి 12 వరకు, సాంకేతిక కారణాల వల్ల కొన్ని కేంద్రాల్లో మార్చి 30న పరీక్షలు నిర్వహించింది. తెలుగుతోపాటు మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించారు. అయితే ఆ తర్వాత ఈ 26,146  పోస్టులను అదనంగా 20,471 పోస్టులను జతచేయడంతో.. మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. ఇందులో పురుషులకు 41,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 5150 పోస్టులు కేటాయించారు. 

* మొత్తం ఖాళీల సంఖ్య: 46,617 పోస్టులు 

పోస్టుల కేటాయింపు: యూఆర్-19,596, ఈడబ్ల్యూఎస్-5632, ఓబీసీ-9799, ఎస్టీ-4794, ఎస్సీ-6796.

విభాగం పోస్టుల సంఖ్య పోస్టుల కేటాయింపు
బీఎస్‌ఎఫ్‌ 12,076 మెన్ - 10227; ఉమెన్  - 1849
సీఐఎస్‌ఎఫ్‌ 13,632  మెన్ - 11,558; ఉమెన్ -  2,074
సీఆర్‌పీఎఫ్‌ 9,410  మెన్ - 9,301; ఉమెన్ - 109
ఎస్‌ఎస్‌బీ 1,926  మెన్ - 1,884; ఉమెన్ - 42
ఐటీబీపీ 6,287  మెన్ - 5,327; ఉమెన్ -  960
ఏఆర్ 2,990  మెన్ - 2,948; ఉమెన్ -  42
ఎస్‌ఎస్‌ఎఫ్‌ 296  మెన్ - 222; ఉమెన్ - 74
మొత్తం ఖాళీలు 46,617 46,617

ALSO READ

టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ కొలువులు, అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా
కేంద్ర భద్రత బలగాల్లో కానిస్టేబుల్‌, రైఫిల్‌ మ్యాన్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సెప్టెంబరు 5న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 39,481 ఖాళీలను భర్తీచేయనుంది. మొత్తం ఖాళీల్లో పురుషులకు 35,612 పోస్టులు; మహిళలకు 3,869  పోస్టులు కేటాయించారు. అభ్యర్థులు సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..