Capgemini Recruitment | న్యూఢిల్లీ: ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొంది. ఇటీవల అతిపెద్ద ఐటీ సర్వీస్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2 శాతం ఉద్యోగులను ఈ ఆర్థిక సంవత్సరంలో తొలగించనున్నట్లు ప్రకటించింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా 12000 సాఫ్ట్ వేర్ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయి రోడ్డున పడనున్నారు. ఓవరాల్‌గా 24 వేల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని ఐటీ సెక్టార్‌లో ఆందోళన మొదలైన తరుణంలో క్యాప్‌జెమిని సంస్థ వారికి ఊరట కలిగించే వార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 40000 నుంచి 45,000 వరకు ఉద్యోగాలు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఇతర ఐటీ కంపెనీలకు భిన్నంగా క్యాప్‌జెమినిభారత ఐటీ రంగంలో భారీ తొలగింపుల సమయంలో క్యాప్‌జెమిని ఇండియా 2025లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు నియామ కాలు చేపడతామని సంస్థ శుభవార్త చెప్పింది. ఐటీ రంగంలో నియామకాలలో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో రిక్రూట్‌మెంట్ విషయాన్ని క్యాప్‌జెమిని సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. ఇతర ఐటీ దిగ్గజాల తరహాలో లేఆఫ్స్ మాట ఎత్తకుండా కొత్తగా నియామకాలు చేపడతామని చెప్పడంతో ఐటీ ఉద్యోగులు, ఫ్రెషర్స్ క్యాప్‌జెమిని వైపు చూస్తున్నారు. 

క్యాప్‌జెమిని తాజా నియామకాలలో 35- 40 ఎక్స్‌పీరియన్స్ ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటారని ది హిందూ బిజినెస్‌లైన్ నివేదిక పేర్కొంది. ఏఐ లాంటి కొత్త టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇదివరకే రియల్ టైం ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు టీంలో చేరితో ప్రయోజనం ఉంటుందని నియామకాలలో వారికి సైతం ప్రాధాన్యం కల్పిస్తున్నారు. 

కాలేజీలలో క్యాంపస్ నియామకాలుఐటీ సంస్థ క్యాప్‌జెమిని తాజా నియామకాలలో ఫ్రెషర్స్ కు సైతం అవకాశం కల్పిస్తోంది. దేశంలోని 50కి పైగా కాలేజీల నుంచి బీటెక్, ఎంసీఏ పూర్తి చేసుకుంటున్న వారిని భర్తీ చేస్తామని సీఈవో అశ్విన్ యార్డి పేర్కొన్నారు. ఇందుకోసం క్యాప్‌జెమినీ కాలేజీలకు ముందుగానే సమాచారం ఇస్తామన్నారు. టాలెంటెడ్ యంగ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో ఆఫీసులో నూతనోత్సహంతో పాటు కొత్త టెక్నాలజీని త్వరగా నేర్చుకునే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. 

AI వర్క్‌ఫోర్స్ కోసం నియామకాలు“AI-రెడీ వర్క్‌ఫోర్స్”ను క్రియేట్ చేయడానికి క్యాప్‌జెమిని ప్రాధాన్యత ఇచ్చింది. అందుకోసం వారికి మొదటి నుంచీ కృత్రిమ మేధస్సు (AI)లో శిక్షణ ఇవ్వాలని, వేగంగా అభివృద్ధి చెందుతున్న AI ల్యాండ్‌స్కేప్‌కు అనుగుణంగా ప్రాజెక్టులకు ఉద్యోగులను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ఖర్చుతో కూడుకున్న, సరికొత్త ఆవిష్కరణ ఆధారిత సేవలకు పెరుగుతున్న క్లయింట్ సర్వీస్ డిమాండ్‌ను ఫోకస్ చేసింది. గ్లోబల్ క్లయింట్స్ ప్రాజెక్టులు, స్కేలబుల్ సొల్యూషన్‌ల కోసం క్యాప్‌జెమిని నియామకాలకు నిర్ణయం తీసుకుంది. WNS సంబంధిత "ఏజెంటిక్ AI" పరిష్కారాలను క్యాప్‌జెమిని విశ్లేషించి కార్యకలాపాలు పెంచాలని సీఈవో భావిస్తున్నారు.

భారతదేశంలో ప్రస్తుతం దాదాపు 1.75 లక్షల మంది ఉద్యోగులతో తమ కార్యకలాపాలు విస్తరించడానికి క్యాప్‌జెమిని చర్యలు చేపట్టింది. ముఖ్యంగా టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి ఐటీ సంస్థలు ఉద్యోగాల తొలగింపు దిశగా అడుగులు వేస్తుంటే క్యాప్‌జెమినీ అందుకు భిన్నంగా కొత్తగా నియామకాలు చేపట్టి AI టెక్నాలజీపై ట్రెనింగ్ ఇచ్చి ప్రాజెక్టులు చేయాలని భావించడం విశేషం.