C-DAC Recruitment: సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) పలు ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 277 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 277
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 35
అర్హత: ప్రాజెక్ట్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 04 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.3.34లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 04
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.3.6లక్షలు-రూ.5.04లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఇంజినీర్ / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 150
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 0-4 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.4.49లక్షలు-రూ.7.11లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్: 25
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 9-15 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.12.63లక్షలు-రూ.22.9లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఔట్‌రీచ్ & ప్లేస్‌మెంట్): 01
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీఏ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 50 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.5.11లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హిందీ): 01
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.3లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్(హెచ్‌ఆర్‌డీ): 01
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.3లక్షలు చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ టెక్నీషియన్: 08
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 03 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.3.28లక్షలు చెల్లిస్తారు.
సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్: 50
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
పని అనుభవం:కనీసం 3-7 సంవత్సరాలు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 సంవత్సరాలు ఉండాలి.
జీతభత్యాలు: సంవత్సరానికి రూ.8.49లక్షలు-రూ.14లక్షలు చెల్లిస్తారు.
విభాగాలు: పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, నెట్‌వర్క్స్ క్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్‌ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ తదితరాలు.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 20.10.2023.
ALSO READ:
నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్‌లో 48 ఖాళీలు
న్యూఢిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్‌బీఈఎంస్) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 20 వరకు కొనసాగనుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వ్యాప్‌కోస్ లిమిటెడ్‌లో 140 కంట్రోల్ ఇంజినీర్ ఖాళీలు, అర్హతలివే!
గురుగ్రామ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్, ఫీల్డ్ క్వాలిటీ అసూరెన్స్ అండ్ కంట్రోల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ఉద్యోగాలు, వివరాలు ఇలా
హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా వివిధ విభాగాలకు డీన్, యూనివర్సిటీ లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..