బీఈడీ పూర్తిచేసిన బీటెక్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇక నుంచి వారుకూడా టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ(టీఆర్టీ)కి అర్హులే అని తెలిపింది. తాజాగా వెలువడిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు వారు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అక్టోబరు 11న ఉత్తర్వులు జారీ చేశారు. 


బీటెక్ విద్యార్థులకు 2015 సంవత్సరం నుంచే బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వందల మంది బీటెక్ విద్యార్థులు బీఈడీ కోర్సులో ప్రవేశం పొందుతున్నారు. వారికి 2017లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రాసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. ఇటీవల 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్ గణితం, భౌతికశాస్త్రం పోస్టులకు వారు పోటీపడొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు వారికి ఒకట్రెండు రోజుల్లో అవకాశం ఇవ్వనున్నారు.


దరఖాస్తుకు 21 వరకు అవకాశం..
దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షలకు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబరు 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబరు 20 నుంచి 24 వరకు, ఎస్‌జీటీ పరీక్షలు నవంబరు 25 నుంచి 30 వరకు నిర్వహించాలి.


ఫిబ్రవరిలో పరీక్షలు..?
టీఆర్‌టీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబరు 20 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ పరీక్షలకు 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది అభ్యర్థులు పోటీపడతారని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్షలను నవంబరులో నిర్వహించకుంటే.. మళ్లీ ఫిబ్రవరి వరకూ స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టీసీఎస్ అయాన్ అప్పట్లోనే స్పష్టంచేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైందని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఎన్నికల కారణంగా వాయిదా పడితే మళ్లీ ఫిబ్రవరిలోనే జరుపుతారని తెలుస్తోంది.


ALSO READ:


తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్‌కు వాయిదా వేయడం తెలిసిందే.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...