బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్  దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఎస్సీ/ ఎస్టీ హబ్ కార్యాలయాల్లో కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ విధానంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 21 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


మొత్తం ఖాళీల సంఖ్య: 30


నేషనల్ ఎస్సీ/ ఎస్టీ హబ్ కార్యాలయాలు: ఆగ్రా, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, లూథియానా, ముంబయి, పుణె, సూరత్, సింధుదుర్గ్, జలౌన్, రాంచీ, గువాహటి.


1)  ఇ-టెండరింగ్ ప్రొఫెషనల్: 12 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ లేదా ఎంబీఏ. డిగ్రీ అర్హత ఉండి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 50 సంవత్సరాలలోపు ఉండాలి. రిటైర్డ్ అయినవారు 65 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.50,000.

Also Read:   ఈస్టర్న్ రైల్వేలో 3115 అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే!


2)  ఫైనాన్స్ ఫెసిలిటేషన్ ప్రొఫెషనల్: 12 పోస్టులు
అర్హత: ఎంబీఏ/ఐసీడబ్ల్యూఏ/బీకామ్. డిగ్రీ అర్హత ఉండి కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్డ్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాలు.
వయోపరిమితి: 50 సంవత్సరాలలోపు ఉండాలి. రిటైర్డ్ అయినవారు 65 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.50,000.


3)  ఆఫీస్ అటెండెంట్: 06 పోస్టులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 
వయోపరిమితి: 21 సంవత్సరాలలోపు ఉండాలి.
జీతం: రూ.17,537.


Also Read:  సెంట్రల్ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, దరఖాస్తు చేసుకోండి!


 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.09.2022.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.10.2022.



Notification 

Online Application
Website


Also Read:


తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులో మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెండు దశల రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టులు తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


Bank of Baroda Recruitment: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 346 ఉద్యోగాలు, డిగ్రీ అర్హత చాలు!
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ విభాగంలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 346 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 20 వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికచేసిన అభ్యర్థులకు ఇంటర్య్యూ నిర్వహించి తుది ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...