Just In





BECIL: బీఈసీఐఎల్‌లో 170 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు - ఈ అర్హతలు తప్పనిసరి!
BECIL Vacancies: బీఈసీఐఎల్‌లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. నర్సింగ్ విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

BECIL Recruitment of Nursing Officer: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) న్యూ డిల్లీలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఒప్పంద ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 04 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులు రూ.295 చెల్లిస్తే సరిపోతుంది.
వివరాలు..
* నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 170
పోస్టుల కేటాయింపు: యూఆర్- 92 పోస్టులు, ఓబీసీ- 40 పోస్టులు, ఎస్సీ- 25 పోస్టులు, ఎస్టీ- 13 పోస్టులు.
విద్యార్హతలు..
⏩ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌చే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా)
⏩ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌చే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ(పోస్ట్-సర్టిఫికేట్)/పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణతతో పాటు రాష్ట్రపరిధిలో నర్సెస్ & మిడ్‌వైఫ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి. (లేదా)
⏩ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌చే గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీలో డిప్లొమాతో పాటు రాష్ట్రపరిధిలో నర్సెస్ & మిడ్‌వైఫ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం ఉండాలి.
అనుభవం: కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు - రూ.590.00; ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు- రూ.295.00.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తును విద్యార్హతలు అండ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ కాపీలతో పాటు నిర్ణీత ఫార్మాట్‌లో సీలు చేసిన కవరులో స్పీడ్ పోస్ట్ ద్వారా “బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్” కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
“Broadcast Engineering Consultants India Limited (BECIL),
BECIL BHAWAN, C-56/A-17,
Sector-62, Noida-201307 (U.P).”
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతం: నెలకు రూ.28,000.
దరఖాస్తుకు జత చేయాల్సిన డాక్యుమెంట్‌లు..
➥ ఎడ్యుకేషనల్ / ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్.
➥ 10వ తరగతి/బర్త్ సర్టిఫికెట్స్.
➥ కాస్ట్ సర్టిఫికేట్ (వర్తిస్తే)
➥ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్(వర్తిస్తే)
➥ పాన్ కార్డ్ కాపీ
➥ ఆధార్ కార్డ్ కాపీ
➥ ఈపీఎఫ్(EPF)/ఈఎస్‌ఐసీ(ESIC) కార్డ్ కాపీ (ఇది వరకు పనిచేస్తునట్లైయితే-వర్తిస్తే)
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.01.2025.
🔰 ఆఫ్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 04.02.2025.
Notification
ALSO READ: బీహెచ్‌ఈఎల్‌లో 400 ఇంజినీర్, సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు - బ్యాచిలర్ డిగ్రీ , డిప్లొమా అర్హతలు