బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్) గువాహటిలోని ఎయిమ్స్‌లో పనిచేయడానికి ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి 21 వరకుఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వివరాలు...
* మొత్తం ఖాళీలు: 73 పోస్టులు
పోస్టుల వారీగా ఖాళీలు..
➥ ఎల్‌డీసీ/ డీఈఓ/జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 10 పోస్టులు
➥ ల్యాబ్ అటెండెంట్(పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ): 06 పోస్టులు
➥ ల్యాబ్ టెక్నీషియన్(పాథాలజీ/మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ/బ్లడ్‌బ్యాంక్/రేడియోథెరపీ): 12 పోస్టులు
➥ మెడికల్ సోషల్ వర్కర్: 01 పోస్టులు
➥మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 01 పోస్టులు
➥ క్లినికల్ సైకాలజిస్ట్: 01 పోస్టులు
➥ ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టులు
➥ స్పీచ్ థెరపిస్ట్/స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్: 01 పోస్టు
➥ ఓపీడీ అటెండెంట్(మోర్ ఫిమేల్స్) డ్రెస్సర్/ హాస్పిటల్ అటెండెంట్ Gr-3: 08 పోస్టులు
➥ అనస్థీషియా టెక్నీషియన్: 02 పోస్టులు
➥ టెక్నికల్ అసిస్టెంట్(డెంటల్):01 పోస్టు
➥ టెక్నికల్ అసిస్టెంట్(ఈసీజీ): 01 పోస్టు
➥ ఆర్థోపెడిక్/ ప్లాస్టర్ టెక్నీషియన్: 01 పోస్టు
➥ జూనియర్ ఇంజనీర్ (సివిల్): 01 పోస్టు
➥ రేడియోగ్రాఫర్/టెక్నీషియన్ (రేడియాలజీ) గ్రేడ్II: 04 పోస్టులు
➥ గ్యాస్ స్టీవార్డ్: 01 పోస్టు
➥ ఫ్లెబోటోమిస్ట్: 05 పోస్టులు
➥ లైబ్రరీ క్లర్క్(C)/జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 01 పోస్టు
➥ ప్రోగ్రామర్ (ఐటీ): 01 పోస్టు
➥ జూనియర్ అడ్మిన్ ఆఫీసర్: 01 పోస్టు
➥ అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్: 01 పోస్టు
➥ యూడీసీ/Sr. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్: 07 పోస్టు
➥ డ్రైవర్: 01 పోస్టు
➥ మెడికల్ ఆఫీసర్ (ఆయుష్: ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి): 01 పోస్టు
➥ యోగా ఇన్‌స్ట్రక్టర్: 01 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ 10+2/ ఇంటర్మీడియట్/ బీఈ/ బీటెక్/బీఎస్సీ/ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ డీఎంఎల్‌టీ/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ ఉత్తీర్ణత.
దరఖాస్తు ఫీజు..
➥ జనరల్ అభ్యర్థులకు రూ.885. అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
➥ ఓబీసీ అభ్యర్థులకు రూ.885.అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
➥ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.531.అదనపు దరఖాస్తు చేసిన ప్రతి పోస్టుకు రూ. 354 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
➥ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.885. అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్ట్‌కు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
➥ మహిళా అభ్యర్థులకు రూ.885. అదనంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పోస్టుకు రూ. 590 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
➥ ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులకు రూ.531. అదనంగా దరఖాస్తు చేసిన ప్రతి పోస్ట్‌కు రూ. 354 దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: స్కిల్‌టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
జీతభత్యాలు: నెలకు రూ.22000-రూ.56100 చెల్లిస్తారు.
దరఖాస్తు చివరితేది: 21.03.2023.
Also Read:
ఎస్‌బీఐలో 868 ఉద్యోగాలు, వీరు మాత్రమే అర్హులు! ఎంపికైతే నెలకు రూ.40 వేల జీతం!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అమరావతి పరిధిలో 39 పోస్టులు, హైదరాబాద్ పరిధిలో 48 పోస్టులు ఉన్నాయి. ఎంపికైనవారిని బిజినెస్ కరస్పాండెంట్ ఫెసిలిటేటర్ పోస్టుల్లో నియమించనుంది. బ్యాంకింగ్‌లో అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 10న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. మార్చి 31తో గడువు ముగియనుంది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ముంబయి పోర్ట్ అథారిటీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు - వివరాలు ఇలా!
ముంబయి పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని ద్వారా మొత్తం 7 వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈ/బీటెక్/గ్రాడ్యుయేషన్/ఎంబీఏ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అబ్యర్థులు ఏప్రిల్ 6 వరకు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవచ్చు. రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..