Border Security Force Jobs Re-Application: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా 141 కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), హెడ్‌కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 25లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి జులై 17తోనే దరఖాస్తు గడువు ముగియగా తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* పారామెడికల్ స్టాఫ్ (గ్రూప్-బి)
1) ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్): 14 పోస్టులు
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: ఇంటర్, డిప్లొమా/డిగ్రీ(జీఎన్‌ఎం).
* పారామెడికల్ స్టాఫ్ (గ్రూప్-సి)
2) ఏఎస్‌ఐ (ల్యాబ్ టెక్నీషియన్): 38 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: ఇంటర్(సైన్స్)తోపాటు డీఎంఎల్‌టీ అర్హత ఉండాలి.
3) ఏఎస్‌ఐ (ఫిజియోథెరపిస్ట్): 47 పోస్టులు
వయోపరిమితి: 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: ఇంటర్(సైన్స్)తోపాటు డిప్లొమా/డిగ్రీ (ఫిజియోథెరపీ).
* ఎస్‌ఎంటీ వర్క్‌షాప్ (గ్రూప్-బి)
4) ఎస్‌ఐ (వెహికిల్ మెకానిక్): 03 పోస్టులు
వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి.
అర్హత: డిప్లొమా/డిగ్రీ(ఆటోమొబైల్/మెకానికల్ ఇంజినీరింగ్).
* ఎస్‌ఎంటీ వర్క్‌షాప్ (గ్రూప్-సి)
5) కానిస్టేబుల్ (OTRP): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
6) కానిస్టేబుల్ (SKT): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
7) కానిస్టేబుల్ (ఫిట్టర్): 04 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
8) కానిస్టేబుల్ (కార్పెంటర్): 02 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
9) కానిస్టేబుల్ (ఆటో ఎలక్ట్రీషియన్): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
10) కానిస్టేబుల్ (వెహికిల్ మెకానిక్): 22 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
11) కానిస్టేబుల్ (BSTS): 02 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
12) కానిస్టేబుల్ (అప్‌హోలస్టెర్): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
* వెటర్నరీ స్టాఫ్ (గ్రూప్-సి) పోస్టులు
13) హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
14) కానిస్టేబుల్ (కెన్నెల్ మ్యాన్): 02 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
* వెటర్నరీ స్టాఫ్ (గ్రూప్-బి) పోస్టులు
15) ఇన్‌స్పెక్టర్ (లైబ్రేరియన్): 02 పోస్టులు
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.
అర్హత: డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్) విద్యార్హత ఉండాలి.
దరఖాస్తు ఫీజు: ఇన్‌స్పెక్టర్ (లైబ్రేరియన్), ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్) పోస్టులకు రూ.247.20/-(పరీక్ష ఫీజు: రూ.200 + సర్వీస్ ఛార్జీలు: రూ.47.20); వెటర్నరీ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు రూ.147.20 (పరీక్ష ఫీజు: రూ.100 + సర్వీస్ ఛార్జీలు: రూ.47.20). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.07.2024.