BSF Recruitment: భార‌త హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్‌) పలు వెటర్నరీ స్టాఫ్ గ్రూప్-సి(నాన్ గెజిటెడ్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వరా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు జూన్ 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 06.


1. హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ): 04 పోస్టులు


2. కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్): 02 పోస్టులు



అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


జీత భత్యాలు: నెలకు హెడ్ కానిస్టేబుల్‌కి  రూ.25,500 - రూ.81,100; కానిస్టేబుల్‌కు రూ.21,700 - రూ.69,100.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17.06.2024.


Notification


Application


Website


ALSO READ:


ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ 'ఏఎఫ్‌క్యాట్' నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు ప్రారంభం ఎప్పడంటే?
Indian Air Force AFCAT Notification: భార‌త వైమానిక ద‌ళంలో ఉన్నత హోదా ఉద్యోగాల భ‌ర్తీకి నిర్వహించే ఏఎఫ్‌క్యాట్ 02/2024 (AFCAT 02/2024) నోటిఫికేషన్ విడుద‌లైంది. వైమానిక దళంలో టెక్నిక‌ల్‌ (Technical), నాన్ టెక్నిక‌ల్‌ (Non Technical) విభాగాల్లో 304 ఖాళీలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 30న ప్రారంభంకానుంది. అభ్యర్థులు జూన్ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.  రాతపరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఎంపికైన అభ్యర్థులను వైమానిక దళంలో కమిషన్డ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. ఎంపికైనవారికి 2025 జులైలో కోర్సులు ప్రారంభంకానున్నాయి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీలో 65 ప్రాజెక్ట్‌ పోస్టులు
IITM Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియెరాలజీ(ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపాదికన ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, నెట్‌/ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ/ గేట్‌ స్కోరుతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..