భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL)లో 75 సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ 25న ప్రారంభమైంది. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు నవంబర్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. బీహెచ్‌ఈఎల్ యూనిట్లు, కార్యాలయాల్లో ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిచేస్తారు.
వివరాలు..
* సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 75
పోస్టుల కేటాయింపు: జనరల్-36, ఈడబ్ల్యూఎస్-07, ఓబీసీ-10, ఎస్సీ-07, ఎస్టీ-06.
➥ సివిల్: 30 పోస్టులు
➥ మెకానికల్: 30 పోస్టులు
➥ హెచ్‌ఆర్: 15 పోస్టులు
అర్హతలు: 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిప్లొమా (సివిల్/మెకానికల్), బ్యాచిలర్స్ డిగ్రీ (బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సోషల్ వర్క్/బిజినెస్ మేనేజ్‌మెంట్/బీబీఎస్/బీఎంఎస్).
వయోపరిమితి: 01.09.2023 నాటికి 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దివ్యాంగులకు 10 -15 సంవత్సరాలపాటు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.795. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.295 చెల్లించాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.
జీతం: ఎంపికైనవారికి శిక్షణ కాలంలో రూ.32,000 - రూ.1,00,000 (బేసిక్ పే రూ.32,000) చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.33,500-రూ.1,20,000 (బేసిక్ పే రూ.33,500) చెల్లిస్తారు. వీటికి ఇతర భత్యాలు అదనం.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.10.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.11.2023. (25.11.2023 వరకు పొడిగించారు).
ALSO READ:
మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్‌లో 32 ఖాళీలు, పోస్టుల వివరాలు ఇలా
నాగ్‌పుర్‌లోని మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్(మొయిల్) లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 9లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.295 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
రాష్ట్రీయ కెమికల్స్ & ఫర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు, ఈ అర్హతలుండాలి
ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్‌ఎల్) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 408 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాలవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత విద్యార్హతల్లో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..