BEL Recruitment: పంచకులలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ & ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 57 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీహెచ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 57


* ట్రైనీ ఇంజినీర్: 36


విభాగాలు: ఎలక్ట్రానిక్స్- 08, మెకానికల్- 28.


* ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్: 21


విభాగాలు: ఎలక్ట్రానిక్స్- 08, మెకానికల్- 08, సివిల్- 01, హెచ్‌ఆర్- 01.


రాజస్థాన్ /గుజరాత్ ప్రాజెక్ట్ సైట్లు: 03


అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీహెచ్‌ఆర్‌ఎం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.08.2023 నాటికి ట్రైనీ ఇంజినీర్‌కు 28 సంవత్సరాలు; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు 32 సంవత్సరాలు మించకూడదు.


దరఖాస్తు ఫీజు: ట్రైనీ ఇంజినీర్‌కు రూ.177; ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు రూ.472.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతం: నెలకు ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - 40,000; ప్రాజెక్ట్ ఇంజినీర్/ ఆఫీసర్‌కు రూ.40,000 - 55,000.


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 26.08.2023.


Notification


Website


ALSO READ:


మజగావ్‌డాక్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో 531 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ముంబయిలోని మజగావ్‌డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 531 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఎస్ఎస్సీ/ ఐటీఐ/ డిప్లొమా/ డిగ్రీ/ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత. నేషనల్అప్రెంటిన్‌షిప్ సర్టిఫికేట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్‌ కార్యాలయాలు/ యూనిట్లలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 45 మేనేజ్‌మెంట్ ట్రైనీ, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జేఎం పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..