BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Continues below advertisement

భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని 'భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్', దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లు/కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 232 ప్రొబేషనరీ ఇంజినీర్, ప్రొబేషనరీ ఆఫీసర్, ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బెంగళూరు, ఘజియాబాద్, పుణె, హైదరాబాద్, చెన్నై, మచిలీపట్నం, పంచకుల, కోట్‌ద్వారా, నవీ ముంబయిలో విధిగా పనిచేయాల్సి ఉంటుంది.

Continues below advertisement

వివరాలు..

* ఖాళీల సంఖ్య: 232.

పోస్టుల కేటాయింపు: జనరల్-96, ఓబీసీ-62, ఎస్సీ-34, ఎస్టీ-17, ఈడబ్ల్యూఎస్-23.

➥ ప్రొబేషనరీ ఇంజినీర్: 205 పోస్టులు

అర్హత: బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్‌/ మెకానికల్‌/ కంప్యూటర్‌ సైన్స్‌). 

వయోపరిమితి: 01.09.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.

➥ ప్రొబేషనరీ ఆఫీసర్ (హెచ్‌ఆర్‌): 12 పోస్టులు

అర్హత: ఎంబీఏ/ ఎంఎస్‌డబ్ల్యూ/ పీజీ/ పీజీ డిప్లొమా(హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్(HRM)/ఇండస్ట్రియల్ రిలేషన్స్/ పర్సనల్ మేనేజ్‌మెంట్‌).

వయోపరిమితి: 01.09.2023 నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.

➥ ప్రొబేషనరీ అకౌంట్స్ ఆఫీసర్: 15 పోస్టులు

అర్హత: సీఏ/ సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 01.09.2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

జీతభత్యాలు: నెలకు రూ.40,000-రూ.1,40,000. ఇతర భత్యాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు...

➥  ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2023.

➥  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 28.10.2023.

➥  కంప్యూటర్ ఆధారిత పరీక్షతేది: డిసెంబర్ 2023.

Notification

Online Application form

OBC Certificate Format

EWS Certificate Format

SC/ST Certificate Format

PwBD Certificate Format

ALSO READ:

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 323 ఉద్యోగాలు, వాక్‌ఇన్ తేదీలివే
ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్‌ఎల్‌) ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ టెక్నిషియల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & హ్యాండీ మ్యాన్/ఉమెన్ భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 323 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు పోస్టుని అనుసరించి అక్టోబర్ 17, 18, 19 తేదీలలో ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

ఎయిమ్స్‌-నాగ్‌పుర్‌లో 68 నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు, అర్హతలివే!
నాగ్‌పుర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌) వివిధ నాన్-ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 68 పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10+2/ డిగ్రీ/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ పీజీ డిగ్రీ/ ఎంఏ/ పీజీ డిప్లొమా/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత.  కంప్యూటర్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Continues below advertisement
Sponsored Links by Taboola