బెంగుళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) సంస్థ పలు విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితులు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 6 నుంచి 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు హార్డ్‌కాపీలను నవంబరు 25లోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
ఖాళీల వివరాలు..
మొత్తం పోస్టుల సంఖ్య: 101.
➥ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: 03 పోస్టులు
➥ డిప్యూటీ జనరల్ మేనేజర్: 08 పోస్టులు
➥ అసిస్టెంట్ మేనేజర్: 35 పోస్టులు
➥ అసిస్టెంట్ జనరల్ మేనేజర్: 08 పోస్టులు
➥ సీనియర్ మేనేజర్: 03 పోస్టులు
➥ ఆఫీసర్: 11 పోస్టులు
➥ చీఫ్ జనరల్ మేనేజర్: 02 పోస్టులు
➥ జనరల్ మేనేజర్: 01 పోస్టు
➥ మేనేజర్: 07 పోస్టులు
➥ అసిస్టెంట్ ఆఫీసర్: 02 పోస్టులు
➥ మేనేజ్‌మెంట్ ట్రైనీ: 21 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
విభాగం | ఖాళీలు |
సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ | 02 |
ఇంజిన్ ప్రాజెక్ట్ | 34 |
డిఫెన్స్-ఏరోస్పేస్ | 02 |
డిఫెన్స్-ఏఆర్వీ ప్రాజెక్ట్ | 15 |
డిఫెన్స్-బిజినెస్ | 06 |
ఇంటర్నేషనల్ బిజినెస్ | 01 |
ఫైనాన్స్, లీగల్, హెచ్ఆర్, సెక్యూరిటీ, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కంపెనీ సెక్రెటరీ | 19 |
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ | 02 |
మేనేజ్‌మెంట్ ట్రైనీ | 21 |
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20.11.2023 నాటికి పోస్టుల ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
జీతభత్యాలు..
అసిస్టెంట్ ఆఫీసర్ | రూ.30,000 – రూ.1,20,000. |
మేనేజ్‌మెంట్ ట్రైనీ/ఆఫీసర్ | రూ.40,000 – రూ.1,40,000. |
అసిస్టెంట్ మేనేజర్ | రూ.50,000 – రూ.1,60,000 |
మేనేజర్ | రూ.60,000 – రూ.1,80,000. |
సీనియర్ మేనేజర్ | రూ.70,000 – రూ.2,00,000. |
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ | రూ.80,000 – రూ.2,20,000. |
డిప్యూటీ జనరల్ మేనేజర్ | రూ.90,000 – రూ.2,40,000. |
జనరల్ మేనేజర్ | రూ.1,00,000 – రూ.2,60,000. |
చీఫ్ జనరల్ మేనేజర్ | రూ.1,20,000 – రూ.2,80,000. |
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ | రూ.1,50,000 – రూ.3,00,000. |
దరఖాస్తు హార్డ్ కాపీలు పంపాల్సిన చిరునామా:
Manager (HR)
Recruitment Cell
BEML Soudha
No 23/1, 4th Main, S R Nagar
Bangalore - 560027.
దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..
➥ పదోతరగతి మార్కుల మెమో
➥ ఇంటర్ మార్కుల మెమో
➥ క్వాలిఫైయింగ్ డిగ్రీ/సీఏ/సీఎంఏ/సీఎస్ మార్కుల సర్టిఫికేట్
➥ పీజీ మార్కుల సర్టిఫికేట్
➥ ఆధార్ కార్డు/పాస్‌పోర్ట్/డ్రైవింగ్ లైసెన్స్/పాన్‌కార్డు etc.
➥ అభ్యర్థుల పూర్తి రెజ్యూమ్
➥ ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్
➥ దివ్యాంగులకు సర్టిఫికేట్
➥ పని అనుభవానికి సంబంధించిన డాక్యుమెంట్లు
➥ ఆర్గనైజేషన్ టర్నోవర్ డాక్యుమెంట్, రిపోర్ట్ స్ట్రక్చర్ (ఎంటీఎస్ పోస్టులకు అవసరం లేదు)
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 06.11.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2023.
➥ దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేది: 25.11.2023.
ALSO READ:
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ(ఫైనాన్స్) పోస్టులు, ఎంపికైతే రూ.1.6 లక్షల వరకు జీతం
➥ పీజీసీఐఎల్‌లో ఆఫీసర్ ట్రైనీ (లా) పోస్టులు, వివరాలు ఇలా
➥ ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు