ప్రభుత్వ రంగ సంస్థ- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్(కాంట్రాక్ట్) ప్రాతిపదికన ప్రాజెక్ట్ ఆఫీసర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైనవారు విధిగా హైదరాబాద్, బెంగళూరు, భానూర్, విశాఖపట్నం, కొచ్చి, ముంబయిలోని ఉన్న బీడీఎల్‌ కార్యాలయాలు/యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మే 24 నుంచి జూన్ 23 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.  

వివరాలు..

* ప్రాజెక్ట్ ఇంజినీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు 

ఖాళీల సంఖ్య: 100 

విభాగాలు: హెచ్‌ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 10.05.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా.

వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.39,000.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 24.05.2023.

➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు: 23.06.2023.

➥ ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 05.07.2023.

➥ ఇంటర్వ్యూ తేదీలు: జులై రెండో వారం.

Notification

Website

Also Read:

ఇండియన్ నేవీలో 372 ఛార్జ్‌మ్యాన్ పోస్టులు, అర్హతలివే!ఇండియన్‌ నేవీలో సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ద్వారా ఛార్జ్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులు హెడ్‌క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్‌క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్‌క్వార్టర్స్ అండమాన్ అండ్‌ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి మే 15న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 29 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికలు చేపడతారు.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

సీడీఎస్ ఎగ్జామినేష‌న్ (II) - 2023 నోటిఫికేషన్ విడుదల - త్రివిధ దళాల్లో 349 ఖాళీలు!కంబైన్డ్‌ డిఫెన్స్ స‌ర్వీసెస్ (సీడీఎస్) ఎగ్జామినేష‌న్(II)-2023 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మే 17న విడుదల చేసింది. దీనిద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్‌‌ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీల్లోని ఖాళీలను భర్తీచేస్తారు. డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత ప‌రీక్ష ఇంటెలిజెన్స్ అండ్ ప‌ర్సనాలిటీ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 17 నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..