భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)- హైదరాబాద్ యూనిట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. మొత్తం 49 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ఆగస్టు 4వ తేదీతో ముగియనుంది. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 పోస్టుల్లో.. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 36, మెకానికల్ విభాగంలో 8, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 4, ప్రాజెక్టు ఆఫీసర్ 1 (హ్యూమన్ రిసోర్సెస్) విభాగంలో ఒక పోస్టు ఉంది.
అకడమిక్ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బెల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://bel-india.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
విద్యార్హత వివరాలు..
- ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 (ఎలక్ట్రానిక్స్) పోస్టులకు బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్)/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/E & T/ టెలీ కమ్యూనికేషన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 (మెకానికల్) పోస్టులకు బీఈ/బీటెక్/బీఎస్సీ (మెకానికల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 (కంప్యూటర్ సైన్స్) పోస్టులకు బీఈ/బీటెక్/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణత సాధించాలి.
- ప్రాజెక్టు ఆఫీసర్ 1 (హ్యూమన్ రిసోర్సెస్) పోస్టుకు హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్‌లో ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంహెచ్‌ఆర్‌ఎం/ఎంఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- వీటితో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
కేటగిరీల వారీగా ఖాళీలు..
- ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 (ఎలక్ట్రానిక్స్): జనరల్- 15, ఓబీసీ- 9, ఎస్సీ- 5, ఎస్టీ- 3, ఈడబ్ల్యూఎస్- 4
- ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 (మెకానికల్): జనరల్- 3, ఓబీసీ- 2, ఎస్సీ- 1, ఎస్టీ- 1, ఈడబ్ల్యూఎస్- 1
- ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 (కంప్యూటర్ సైన్స్): జనరల్- 1, ఓబీసీ- 1, ఎస్సీ- 1, ఎస్టీ- 1
- ప్రాజెక్టు ఆఫీసర్ 1 (హ్యూమన్ రిసోర్సెస్): జనరల్- 1
ముఖ్య సమాచారం:
వయసు: అభ్యర్థుల వయసు 202 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనంగా రూ.35,000 అందిస్తారు. తర్వాత ఏడాదికి రూ.5 వేల చొప్పున పెంచుతారు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా వారు రూ. 500 చెల్లించాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కుల చొప్పున మొత్తం 100 మార్కులు కేటాయించారు.
మచిలీపట్నం బెల్‌లో 6 ఖాళీలు..
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మచిలీపట్నం యూనిట్‌లో 6 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ప్రాజెక్ట్ ఇంజనీర్, ట్రైనీ ఇంజనీర్ విభాగంలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాలలో ప్రాజెక్ట్ ఇంజనీర్ 1, ట్రైనీ ఇంజనీర్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. కాంట్రాక్టు విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 3లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాలను https://bel-india.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.