బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ప్రొబేషనరీ ఇంజినీర్ & సీనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌‌లో ఎంఎస్‌సీ(టెక్), ఎంఈ/ఎంటెక్, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక ఉంటుంది. 


వివరాలు..


మొత్తం ఖాళీలు: 11


➥ ప్రొబేషనరీ ఇంజినీర్: 06 


➥  సీనియర్ఇంజినీర్‌: 05


అర్హత: పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌‌లో ఎంఎస్‌సీ(టెక్), ఎంఈ/ఎంటెక్, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: పోస్టుని అనుసరించి 25-32 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు ఫీజు: రూ.708. ఎస్సీ, ఎస్టీ,పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


హార్డు కాపీలు పంపాల్సిన చిరునామా:
Additional General Manager (HR&A)
Bharat Electronics Limited, N.D.A.
Pashan, Pune- 411021,Maharashtra, India


ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


జీతభత్యాలు: ప్రొబేషనరీ ఇంజినీర్: రూ.40,000- 1,40,000, సీనియర్ఇంజినీర్‌: రూ.50,000- 1,60,000


ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరితేది: 23.06.2023.


Notification


Website



Also Read:


నావల్ డాక్‌యార్డులో 281 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, వివరాలు ఇలా!
ముంబయిలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 281 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


హైదరాబాద్‌ డీఆర్‌డీఓ-ఆర్‌సీఐలో 150 అప్రెంటిస్‌ పోస్టులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిసెర్చ్ సెంటర్‌ ఇమారత్‌(ఆర్‌సీఐ) వివిధ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 150 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌, డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..