Bank of Baroda Recruitment: గుజరాత్ రాష్ట్రం వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయం రెగ్యులర్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 168 ఖాళీలను దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జులై 2 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 168.
విభాగాలవారీగా ఖాళీలు..
1. ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్(MMG/S-II): 11 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా, (మార్కెటింగ్/సేల్స్)స్పెషలైజేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2. ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజర్(MMG/S-III): 04 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా, (మార్కెటింగ్/సేల్స్)స్పెషలైజేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
3. క్రెడిట్ అనలిస్ట్(MMG/S-II): 10 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ సీఏతో పాటు పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 25-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. క్రెడిట్ అనలిస్ట్(MMG/S-III): 70 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా, ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ లేదా సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
5. రిలేషన్‌షిప్ మేనేజర్(MMG/S-III): 44 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా, ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ లేదా సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
6. రిలేషన్‌షిప్ మేనేజర్(SMG/S-IV): 22 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా, ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్ లేదా సీఏ/ సీఎంఏ/ సీఎస్/ సీఎఫ్‌ఏతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35-42 సంవత్సరాల మధ్య ఉండాలి.
7. సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్(MMG/S-III): 04 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ సీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / డిప్లొమా (ఫైనాన్స్)తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-38 సంవత్సరాల మధ్య ఉండాలి.
8. చీఫ్ మేనేజర్ ఇంటర్నల్ కంట్రోల్స్(SMG/S-IV): 03 పోస్టులు
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ సీఏ, DISA/CISA సర్టిఫికేషన్‌తో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.07.2024.