గుజరాత్‌లోని వడోదర ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 22న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, ఫిబ్రవరి 14 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. 


మొత్తం ఖాళీలు: 546


వివరాలు..


1) వెల్త్ మేనేజ్‌మెంట్: 24 పోస్టులు
విభాగాలు:
➥ ఎన్ఆర్ఐ వెల్త్ ప్రొడక్ట్స్ మేనేజర్
➥గ్రూప్ సేల్స్ హెడ్
➥ వెల్త్ స్ట్రాటజిస్ట్
➥ హెడ్ వెల్త్-టెక్నాలజీ
➥ ప్రొడక్ట్ మేనేజర్(ట్రేడ్ అండ్ ఫారెక్స్)
➥ ట్రేడ్ రెగ్యులేషన్ సీనియర్ మేనేజర్


2) ప్రైవేట్ బ్యాంకింగ్: 17 పోస్టులు
విభాగాలు:
➥ రేడియన్స్ ప్రైవేట్ సేల్స్ హెడ్
➥ ప్రొడక్ట్ హెడ్-ప్రైవేట్ బ్యాంకింగ్
➥ ప్రైవేట్ బ్యాంకర్ 


3)  అక్విజిషన్ విభాగం: 505 పోస్టులు
విభాగాలు:
➥ అక్విజిషన్ ఆఫీసర్
➥ నేషనల్ అక్విజిషన్ హెడ్
➥ రీజినల్ అక్విజిషన్ సేల్స్ హెడ్


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ(గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత ఉండాలి.


వయోపరిమితి: అక్విజిషన్ విభాగానికి సంబంధించిన పోస్టులకు 21-28 సంవత్సరాల మధ్య, ఇతర పోస్టులకు 24-50 సంవత్సరాల మధ్య ఉండాలి.


జీతభత్యాలు: అక్విజిషన్ విభాగానికి సంబంధించి మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.5 లక్షలు, నాన్ మెట్రో నగరాల్లోని అభ్యర్థులకు ఏటా రూ.4 లక్షలు చెల్లిస్తారు. ఇతర అభ్యర్థులకు సంస్థ నిబంధనల ప్రకారం జీతభత్యాలు ఉంటాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


దరఖాస్తు ఫీజు: రూ.600.


ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్/ ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.


పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 90 నిమిషాలు.


తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.02.2023 నుంచి.


➥ దరఖాస్తు చివరి తేది: 14.03.2023.


Notification (Wealth Management Professionals)


Online Application


Notification (Acquisition Officers)


Online Application


Also Read


IDBI Jobs: ఐడీబీఐ బ్యాంకులో 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) అసిస్టెంట్ మేనేజనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 600 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఏదైనా డిగ్రీతోపాటు నిర్ణీత పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 28లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్ట్‌ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు మార్చి 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐఎల్‌బీఎస్‌‌లో 260 ఉద్యోగాలు, ఈ అర్హతలు ఉండాలి!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...