దేవాస్ (ఎంపీ)లోని బ్యాంక్ నోట్ ప్రెస్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 111 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 21 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 111
⏩ సూపర్‌వైజర్(ప్రింటింగ్): 08
⏩ సూపర్‌వైజర్(కంట్రోల్): 03
⏩ సూపర్‌వైజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01
⏩ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 04
⏩ జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్): 27
⏩ జూనియర్ టెక్నీషియన్(కంట్రోల్): 25 పోస్టులు
⏩ జూనియర్ టెక్నీషియన్(ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ ల్యాబొరేటరీ అసిస్టెంట్/ మెషినిస్ట్/ మెషినిస్ట్ గ్రైండర్/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్): 15
⏩ జూనియర్ టెక్నీషియన్(మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్): 03
⏩ జూనియర్ టెక్నీషియన్(ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 04
⏩ జూనియర్ టెక్నీషియన్(సివిల్ / ఎన్విరాన్‌మెంట్): 01
అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: సూపర్‌వైజర్ పోస్టలకు 18-30 సంవత్సరాలు; జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టలకు 18-28 సంవత్సరాలు; జూనియర్ టెక్నీషియన్ పోస్టలకు18- 25 సంవత్సరాలు మించకూడదు.
పరీక్ష ఫీజు: జనరల్,ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.200.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పే స్కేల్: సూపర్‌వైజర్: నెలకు రూ.27600–95910; జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: రూ.21540–77160; జూనియర్ టెక్నీషియన్: రూ.18780–67390. చెల్లిస్తారు.
ముఖ్యమైనతేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.07.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023.
➥ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్/ అక్టోబర్ 2023.
ALSO READ:
ఎన్‌ఐఓహెచ్ అహ్మదాబాద్‌లో 54 టెక్నికల్ పోస్టులు, వివరాలు ఇలా!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఐసీఎంఆర్ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్(ఎన్ఐఓహెచ్) టెక్నికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 12వ తరగతి, ఇంటర్, బీఈ, బీటెక్, ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 04 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 184 అప్రెంటిస్ ఖాళీలు, అర్హతలివే!
మధ్యప్రదేశ్ బాలాఘట్‌లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(హెచ్‌సీఎల్) ఆధ్వర్యంలో పనిచేస్తున్న మలాంజ్‌ఖండ్ కాపర్ ప్రాజెక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి లేదా ఇంటర్ అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే మైనింగ్ విభాగంలో పోస్టులకు ఇంటర్ అర్హత అవసరం లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial