షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం.. 2022 సంవత్సరానికి సంబంధించి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా.. గ్రూప్‌ బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు/మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా హవల్దార్, రైఫిల్‌మ్యాన్, వారెంట్ ఆఫీసర్, నాయబ్ సుబేదార్ వంటి పలు (ట్రేడ్స్‌మెన్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.


మొత్తం ఖాళీలు: 1380


ఖాళీల వివరాలు..


1) హవ్లీదార్ క్లర్క్-287


2) హవ్లీదార్ ఆపరేటర్ రేడియో & లైన్ - 729 


3) నాయబ్ సుబేదార్ - 17 


3) రైఫిల్ ఆర్మౌరర్‌ -48 


4) రైఫిల్ బార్బర్ /ఆయా - 15 


5) రైఫిల్ ల్యాబోరేటరీ అసిస్టెంట్ - 13 


6) రైఫిల్ నర్సింగ్ అసిస్టెంట్– 100 


7) రైఫిల్ వాషర్‌మ్యాన్- 80 


8) వారంట్ ఆఫీసర్ రేడియో మెకానిక్ - 72 


9) వారంట్ ఆఫీసర్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్- 10 


10) నాయబ్ సుబేదార్ రిలీజియస్ టీచర్- 09 


అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.



  • హవ్లీదార్ క్లర్క్: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంగ్లిష్ లేదా హిందీ టైపింగ్ తెలిసి ఉండాలి. 

  • హవ్లీదార్ ఆపరేటర్ రేడియో & లైన్: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. లేదా పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉండాలి. 

  • నాయబ్ సుబేదార్: పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 

  • రైఫిల్ ఆర్మౌరర్‌:  పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

  • రైఫిల్ బార్బర్ /ఆయా:  పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

  • రైఫిల్ ల్యాబోరేటరీ అసిస్టెంట్: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

  • రైఫిల్ నర్సింగ్ అసిస్టెంట్:  పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

  • రైఫిల్ వాషర్‌మ్యాన్: పదోతరగతి ఉత్తీర్ణత ఉండాలి.

  • వారంట్ ఆఫీసర్ రేడియో మెకానిక్:  పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి. 

  • వారంట్ ఆఫీసర్ వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్: ఇంటర్‌తోపాటు వెటర్నరీ విభాగంలో డిప్లొమా అర్హత ఉండాలి.

  • నాయబ్ సుబేదార్ రిలీజియస్ టీచర్:  సంస్కృత లేదా హిందీ మాధ్యమంలో డిగ్రీ ఉండాలి.


వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అసోం రైఫిల్ పర్సనల్, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఫిజికల్ క్వాలిటీ టెస్ట్‌, ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, మెడికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టింగ్ ఉంటుంది.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: జులై 20, 2022.


అస్సాం రైఫిల్స్‌ ర్యాలీ నిర్వహించు తేదీ: సెప్టెంబర్‌, 2022.


Notification


Online Application


Re Print Form


Website