Army Public Schools Teaching Staff Notification: దేశవ్యాప్తంగా ఉన్న కంటోన్మెంట్స్, మిలిటరీ స్టేషన్ల పరిధిలోని 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో టీచింగ్ పోస్టుల భర్తీకి 'ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ' నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పీఆర్‌టీ (PRT) పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. తెలంగాణ సికింద్రాబాద్ (ఆర్‌కేపీ), సికింద్రాబాద్ (బొల్లారం), గోల్కొండ సైనిక పాఠశాలలు ఉన్నాయి.  


వివరాలు..


1) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) 


సబ్జెక్టులు: అకౌంటెన్సీ, బయాలజీ, బయోటెక్నాలజీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ కోర్, ఫైన్ ఆర్ట్స్, జాగ్రఫీ, హిస్టరీ, హిందీ, హోంసైన్స్, ఇన్‌ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, మ్యాథమెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ.


అర్హత: కనీసం 50% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ లేదా బీఎస్సీ లేదా పీజీ డిప్లొమా లేదా ఎంసీఏ/ఎంఎస్సీ లేదా బీ లెవెల్ నుంచి డీవోఈఏసీసీ. బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ, హిందీ అండ్ ఇంగ్లీషు టీచీంగ్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం ఉండాలి.


2) ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) 


సబ్జెక్టులు: కంప్యూటర్ సైన్స్, ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృతం, సైన్స్, ఎస్‌ఎస్‌టీ.


అర్హత: సంబంధిత విభాగంలో బీపీఈడీ లేదా బీపీఈ లేదా బీఎస్సీ అండ్ ఎంపీఈడీ కలిగి ఉండాలి. 


3) పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్‌) 


సబ్జెక్టులు: ఫిజికల్ ఎడ్యుకేషన్ (విత్/విత్ అవుట్).


అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో నాలుగు సంవత్సరాల “ఎన్‌సీఈఆర్‌టీ యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు లేదా కనీసం 55% మార్కులతో పోస్ట్-గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన గ్రేడ్ అండ్ మూడు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ/ఎంఈడీ లేదా కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టులు/ కాంబీనేషన్ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ, సీబీఎస్‌ఈ/రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే సీటెట్/టెట్‌లో ఉత్తీర్ణత, ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్‌లో ప్రావీణ్యం, కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 01.04.2024 నాటికి ఫ్రెషర్స్‌ 40 సంవత్సరాలలోపు ఉండాలి. తగిన అనుభవం ఉన్న అభ్యర్థులు 57 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


దరఖాస్తు ఫీజు: రూ.385.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రావీణ్యం, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. మల్టీపుల్ చాయిస్ విధానంలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానంలో అమల్లో ఉంటుంది. ప్రతి తప్పుకు 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు. అంటే ప్రతి నాలుగు తప్పులకు ఒకమార్కు కోత ఉంటుంది.


పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌లో మాత్రమే.


ముఖ్యమైన తేదీలు.. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 10.09.2024. 


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 25.10.2024. 


➥ పరీక్ష తేదీలు: 23, 24.11.2024.


➥ పరీక్ష రిజర్వ్ తేదీ: 25.11.2024.


➥ ఫలితాల వెల్లడి: 10.12.2024.


Notification


Online Application


Website 



మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..