హైదరాబాద్‌లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌(ఏపీఎస్‌) టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో జూన్ 15 వరకు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


వివరాలు...


ఖాళీల సంఖ్య: 18


1) పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్): 01 పోస్టు


సబ్జెక్టు: సైకాలజీ.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియం బోధన, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.


2) టీజీటీ (ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్): 06 పోస్టులు


సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, కంప్యూటర్స్.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియం బోధన, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.


3) పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్): 11 పోస్టులు


విభాగాలు: అన్ని సబ్జె్క్టులు-07, మ్యూజిక్-1, డ్యాన్స్-1, ఆర్ట్స్-1, యోగా-01.


అర్హత: సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ/ డిప్లొమా అర్హత ఉండాలి. ఇంగ్లిష్ మీడియం బోధన, కంప్యూటర్ అప్లికేషన్ నాలెడ్జ్ ఉండాలి.


➥ మ్యూజిక్ టీచర్ పోస్టుకు కీబోర్డు, గిటార్ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ (మ్యూజిక్) ఉండాలి.


➥ డ్యాన్స్ టీచర్ పోస్టుకు గ్రాడ్యుయేషన్ (డిగ్రీ). డిఫరెంట్ డ్యాన్స్ స్టైల్స్ తెలిసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.


➥ ఆర్ట్స్ టీచర్ పోస్టులకు 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి.


➥ యోగా పోస్టులకు డిగ్రీతోపాటు యోగాలో డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. దరఖాస్తుకు విద్యార్హతకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జతచేసి పంపాలి. 


ఎంపిక విధానం: స్క్రూటినీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
Army Public School, Golconda, 
Near Ibrahimbagh Post Office, 
Sun City, Hyderabad-500031.


దరఖాస్తు చివరితేది: 15.06.2023.


Website



Also Read:


ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు- అర్హత, వివరాలు ఇలా!
ఇండియన్ ఆర్మీ జనవరి 2024లో ప్రారంభమయ్యే 50వ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(టీఈఎస్) కోర్సు శిక్షణలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్‌ బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో 10+2(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌) లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2023లో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.  అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


పూణే ఐఐటీఎంలో 22 రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టులు, వివరాలు ఇలా!
పూణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం) రిసెర్చ్ అసోసియేట్&రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 22 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డాక్టరేట్ డిగ్రీ, సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌, గేట్‌/ జెస్ట్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి. ఈ పోస్టులకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగ ఎంపిక చేస్తారు. 
నోటిఫికేషన్, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..