APTET August - 2022 Notification: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెట్‌ (Teachers Eligibility Test) నోటిఫికేషన్‌ను నేడు (జూన్ 10) విడుదల చేసింది. దరఖాస్తు దారులు జూన్‌ 15 నుంచి జూలై 15 వరకు ఆన్‌లైన్‌లో ఫీజుల చెల్లింపు కోసం అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 31న టెట్‌ కీ విడుదల చేసి, సెప్టెంబర్‌ 14న ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. టెట్‌కి సంబంధించిన పూర్తి సమాచారం aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.


పాఠశాల విద్యాశాఖ నిర్వహించే APTET-August, 2022 పరీక్షను అన్ని జిల్లాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నారు. TET లక్ష్యం జాతీయ ప్రమాణాలు పాటించడం, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్‌కు (National Council for Teacher Education - NCTE) అనుగుణంగా నియామక ప్రక్రియలో ఉపాధ్యాయుల నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


‘‘ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము. (APTET- ఆగస్టు, 2022) రాష్ట్రంలో టీచర్లు కావాలనుకునే అభ్యర్థుల నుంచి ప్రభుత్వం, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నియంత్రణలో ఉన్న ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలలు మొదలైన వాటి కోసం ఒకటి నుంచి 8వ తరగతి వరకూ టీచర్ల నియామకం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ప్రభుత్వం భారతదేశ RTE చట్టం, 2009 “ది రైట్ ఆఫ్ చైల్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్, నిర్భంద విద్య లోని సెక్షన్ 23 సబ్-సెక్షన్ (1) ప్రకారం నియామక ప్రక్రియ జరుగుతుంది.’’ అని నోటిఫికేషన్ లో వివరించారు.


అర్హతలు
DL.Ed పట్టా కలిగి ఉన్న అభ్యర్థులు/ బీ.ఎడ్ / భాష పండిట్ లేదా తత్సమాన అర్హతలు, లేదా ఫైనల్‌ ఇయర్ ను అభ్యసిస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


పరీక్షల షెడ్యూల్
పరీక్ష తేదీ: 06.08.2022 to 21.08.2022
పరీక్షా సమయం (ఉదయం): 09.30 A.M. to 12.00 Noon - 2:30 Hours
పరీక్షా సమయం (సాయంత్రం): 02.30 P.M. to 5.00 P.M - 2:30 Hours


ఉదయం I(A), II(A), సాయంత్రం I(B) II(B) పరీక్షలు జరగనున్నాయి.