ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్ఈఐఎస్) 46 బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపాల్ గ్రేడ్ (2), టీజీటీ, కేర్ టేకర్ (వార్డెన్) విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ గడువు ఆగస్టు 16తో ముగియనుంది. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తోంది. మెరిట్ లిస్ట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తుంది.
అర్హత, ఆసక్తి గల వారు రూ.300 దరఖాస్తు ఫీజు చెల్లించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 జూలై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 47 సంవత్సరాల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం https://welfarerecruitments.apcfss.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. https://jnanabhumi.ap.gov.in/ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Also Read: BEL Recruitment 2021: ఎలాంటి పరీక్షలు లేకుండానే బెల్‌లో ఉద్యోగాలు... రూ.50 వేల వరకు జీతం...
విభాగాల వారీగా వివరాలు..
- ప్రిన్సిపాల్ గ్రేడ్ - 2 విభాగంలో మొత్తం ఒక పోస్టు (ఎస్సీ విభాగంలో) ఉంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దీంతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెల వేతనం రూ.40,270 నుంచి రూ.93,780 వరకు ఉంటుంది.
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) విభాగంలో 38 ఖాళీలు (ఎస్సీ విభాగంలో 17, ఎస్టీ విభాగంలో 21 ) ఉన్నాయి. ఈ పోస్టులకు పీజీతో పాటు బీఈడీ చేసిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే టెట్ 2 (TET-2) పేపర్ ఉత్తర్ణత సాధించి ఉండాలి. ఇందులో ఎంపికైన వారికి నెల వేతనం రూ.28,940 నుంచి రూ.78,910 వరకు ఉంటుంది.
- కేర్ టేకర్ (వార్డెన్) విభాగంలో 7 ఖాళీలు (ఎస్సీలకు 4, ఎస్టీలకు 3) ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు వారికి నెల వేతనం రూ.21,200 నుంచి రూ. 63,010 వరకు చెల్లిస్తారు.